టీడీపీ జనసేన పోటా పోటీ ... వైసీపీ ప్లేస్ ఎక్కడ ?
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి టాప్ ప్లేస్ టాప్ చెయిర్ అని అంటున్నారు ఆ పార్టీ పార్లమెంటరీ నేత వి విజయసాయిరెడ్డి. ఆయన మాటల్లో చెప్పాలంటే వైసీపీ విజయం ఎపుడో ఖరారు అయిపోయింది.
By: Tupaki Desk | 11 Aug 2023 5:06 PM GMTఏపీలో ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. ఇది పార్టీలను చుట్టుముట్టేసి వడగాలిని రగిలిస్తోంది. అందుకే పార్టీల అధినేతలు, కీలక నాయకులు ఇచ్చే స్టేట్మెంట్స్ లో ఆ వేడి వాడి అలాగే కనిపిస్తోంది. ఇక సర్వేలు చూస్తే ఎవరిది వారిదే. ఏ పార్టీ సర్వే ఆ పార్టీ సూపర్ హిట్ అంటోంది. జోస్యాలు కూడా నాయకుల పెదాల మీద అలా తారట్లాడుతున్నాయి.
విజయం మాదే ప్రత్యర్ధి పక్షాలు సోదిలోకి లేకుండా పోతారంటూ గట్టిగానే అంటున్నారు ఇక మీ పని సరి మేమే మీకు గురి అంటూ చాలానే మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్నికలు అచ్చంగా ఎనిమిది నెలల దగ్గరకు వచ్చేశాయి. ఈ నేపధ్యంలో వస్తున్న సర్వేలు కూడా కంగారు పుట్టిస్తున్నాయి. ఏది నమ్మాలి ఏది తీసుకోవాలి అన్నది అర్ధం కాకుండా ఉన్న సీన్.
ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీకి టాప్ ప్లేస్ టాప్ చెయిర్ అని అంటున్నారు ఆ పార్టీ పార్లమెంటరీ నేత వి విజయసాయిరెడ్డి. ఆయన మాటల్లో చెప్పాలంటే వైసీపీ విజయం ఎపుడో ఖరారు అయిపోయింది. 51 శాతం ఓటింగ్ షేర్ వైసీపీ సొంతం. ఎపుడు ఎన్నికలు వచ్చినా ఇదే రాసిపెట్టుకోండి అని విజయసాయిరెడ్డి అంటున్నారు.
అంటే వైసీపీ మెజారిటీ ఓట్లతో మళ్లీ అధికారంలోకి వస్తుందని విజయసాయిరెడ్డి అంటున్నారు. అదే టైం లో టీడీపీ జనసేన బీజేపీ మరే పార్టీ అయినా రెండవ ప్లేస్ కోసమే పోటా పోటీ పడాల్సిందే అని అంటున్నారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ ఓట్లు జనసేనకు, జనసేన ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవుతాయని జనసేన ఓట్లు బీజేపీకి మళ్ళుతాయని విజయసాయిరెడ్డి కొత్త థియరీ చెప్పుకొచ్చారు.
మొత్తానికి ఆయన చెబుతున్న జోస్యం చూస్తే ఏపీలో 2024లో వైసీపీ పాత రికార్డులను బద్దలు కొడుతూ గెలిచి తీరుతుందని అంటున్నారు. వైసీపీ దరిదాపుల్లో కూడా జనసేన టీడీపీ రాలేవని అంటున్నారు. ఇక ఎందుకీ వ్యర్ధ ప్రయత్నాలు ఏపీలో 2024 ఎన్నికల్లో సీఎం కుర్చీ ఖాళీ అయితే లేదు. 2029లో సీఎం సీటు కోసం అయితే బెటర్ లక్ ట్రై చేసుకోండి అంటున్నారు విజయసాయిరెడ్డి.
చాన్నాళ్ళ తరువాత ఆయన ట్విట్టర్ మళ్లీ జోరందుకుంది. వైసీపీ ఫ్యాన్స్ ని మురిపించేలా ట్వీట్లు పెడుతున్నారు. అవన్నీ కూడా ప్రత్యర్ధులను హీటెక్కించేలా సాగుతున్నాయి. ఏపీలో 2029 వరకూ విపక్షాలు వెయిట్ చేయాలని విజయసాయిరెడ్డి సూచించడం మరి ఆయా పార్టీలకు ఎలా ఉంటుందో కానీ ఏపీలో రాజకీయం కాక మీద ఉన్నపుడు మరింత కెలికి కంగాళీ చేసినట్లుగా విజయసాయిరెడ్డి ట్వీట్లు ఉన్నాయని అంటున్నారు. సో వైసీపీ ఫుల్ జోష్ గా ఉంది ఈ ట్వీట్లతో ప్రత్యర్ధులకే ఏమీ అర్ధం కావడంలేదు అని అంటున్నారు.