Begin typing your search above and press return to search.

వాటే చేంజ్ : టీడీపీ 6... వైసీపీ 15

నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కేవలం నాలుగు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   20 Jun 2024 3:53 AM GMT
వాటే చేంజ్ :  టీడీపీ 6... వైసీపీ 15
X

ఏమిటీ నంబర్లు అని అనుకుంటున్నారా. ఇవి నంబర్లు కాదు హోదాలు. దాని కంటే ముందు రాజకీయ పార్టీల జాతకాలు కూడా. ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో పాతిక సీట్లకు గానూ 16 ఎంపీలు గెలుచుకుని టీడీపీ టాప్ లేపింది. నిన్నటి దాకా అధికారంలో ఉన్న వైసీపీ కేవలం నాలుగు ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. 2019లో వైసీపీకి 22 సీట్లు వచ్చిన సంగతి విధితమే.

ఆనాడు లోక్ సభలో నాలుగో పెద్ద పార్టీగా ఉన్న వైసీపీ ప్లేస్ ఇపుడు చాలా వెనక్కి వెళ్ళిపోయింది. ఇక అప్పట్లో ముగ్గురు ఎంపీలతో లాస్ట్ బెంచీలో ఉన్న టీడీపీ ఇపుడు మొదటి వరసలోకి వచ్చేసింది. ఈ వివరాలు అన్నీ కూడా టీడీపీ శ్రేణులను ఫుల్ ఖుషీ చేస్తున్నాయి.

అలా జాతీయ స్థాయిలో చాలా కాలం తరువాత టీడీపీ పసుపు జెండా రెపరెపలాడుతోంది. తాజాగా జరిగిన పద్దెనిమిదవ లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ మంచి నంబర్ ని సాధించి పార్లమెంట్ లోకి అడుగుపెడుతోంది. దేశంలోని మొత్తం ఉన్న పార్టీలలో 41 పార్టీలకు చెందిన ఎంపీలు ఈసారి లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు.

మరి ఈ నలభై ఒక్క పార్టీలకూ వారి పెర్ఫార్మెన్స్ బట్టి నంబర్లు కూడా ఇస్తున్నారు. 240 ఎంపీలను గెలుచుకున్న బీజేపీ సహజంగానే మొదటి ప్లేస్ లో ఉంటుంది. పైగా అధికార పార్టీ కూడా. రెండో ప్లేస్ లో 99 ఎంపీలు సాధించిన కాంగ్రెస్ ఉంది. అలాగే మూడవ ప్లేస్ లో చూస్తే 37 మంది ఎంపీలను గెలుచుకుని సమాజ్ వాదీ పార్టీ దూకుడు చేస్తోంది.

అదే విధంగా 29 ఎంపీలతో తృణమూల్ కాంగ్రెస్ నాలుగో ప్లేస్ కొట్టేసింది. 22 మంది ఎంపీలతో డీఎంకే అయిదవ ప్లేస్ లో ఉంటే 16 మంది ఎంపీలతో టీడీపీ ఆరవ ప్లేస్ లో ఉంది అని అంటున్నారు. ఇలా జాతీయ స్థాయిలో ఆరవ ప్లేస్ లో ఉన్నా ఎన్డీయే అధికార కూటమిలో రెండో ప్లేస్ లో టీడీపీ ఉంది. అలా తన ప్రాముఖ్యతను చాటి చెప్పింది అని అంటున్నారు.

టీడీపీ 1984 నుంచి కూడా జాతీయ స్థాయిలో చాలా సందర్భాలలో తన సత్తా చాటుతూ వస్తోంది. 1984లో ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించింది. 1999లో 35 మంది ఎంపీలతో వాజ్ పేయ్ ప్రభుత్వంలో కీలకంగా మారింది. దాని కంటే ముందు 30 మంది ఎంపీలు సాధించి 1986లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కూడా అత్యంత ముఖ్య భూమికను టీడీపీ పోషించింది.

ఇక 2014లో 15 మంది ఎంపీలు టీడీపీకి దక్కారు. ఈసారి 16 మంది ఎంపీలతో ఎన్డీయేకు ఆక్సిజన్ గా మారింది. మరి వైసీపీ నంబర్ ఎంత అంటే 15వ ప్లేస్ అని అంటున్నారు. ఆనాడు మూడవ ప్లేస్ లో ఉన్న వైసీపీ ఇపుడు ఏకంగా 15వ ప్లేస్ లోకి జారడం అంటే దారుణమైన ఓటమి ఆ పార్టీని జాతీయ స్థాయిలో ఎంత వెనక్కి నెట్టిందో అర్ధం చేసుకోవాల్సిందే. ఏది ఏమైనా మళ్ళీ ఢిల్లీలో టీడీపీ హవా స్టార్ట్ అయింది అని ఏపీకి ఇక అన్నీ మంచి రోజులే అని ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.