Begin typing your search above and press return to search.

జగన్ ఇప్పటికైనా మేలుకొన్నారా ?

ఓటమి తరువాత వైసీపీ సమీక్షలు చేసుకుంది కానీ అవి చిత్తశుద్ధితో సాగాయా అంటే ఆలోచించాల్సిందే అన్న వారూ ఉన్నారు.

By:  Tupaki Desk   |   21 July 2024 3:45 AM GMT
జగన్ ఇప్పటికైనా మేలుకొన్నారా ?
X

వైఎస్ జగన్ కి భారీ ఓటమి తగిలింది. ఒక విధంగా దూసుకుపోతున్న పార్టీకి ఇది అతి పెద్ద స్పీడ్ బ్రేకర్. ఎదురులేదు అనుకున్న అధినాయకుడికి గతాన్ని గుర్తు చేసి ఎక్కడో పెట్టింది ఈ పరాజయం. ఓటమి తరువాత వైసీపీ సమీక్షలు చేసుకుంది కానీ అవి చిత్తశుద్ధితో సాగాయా అంటే ఆలోచించాల్సిందే అన్న వారూ ఉన్నారు.

ఈ నేపథ్యంలో నుంచి చూసినపుడు అనేక ప్రశ్నలు సందేహాలు వస్తాయి. మాజీ సీఎం జగన్ 2019 ఎన్నికల్లో 151 సీట్లతో 50 శాతం ఓటు షేర్ తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. కాలం గిర్రున అయిదేళ్ళు తిరిగేసరికి 40 శాతం ఓటు షేర్ తో కేవలం 11 సీట్లకు మాత్రమే జగన్ పరిమితం అయ్యారు.

అసలు ఇంత తేడా ఎందుకు వచ్చింది అని వైసీపీ వాళ్లు ఎంతలా తలలు బద్ధలు కొట్టుకున్నా అర్ధం కావడం లేదు. గ్రౌండ్ లెవెల్ లో సీన్ ఏంటో కూడా అంతు పట్టలేదు. ఆనాడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల నుంచి ఎమ్మెల్యేల దాకా అందరికీ అధికారం అనే అహంకారం అసలు ఏమి చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అని అంటారు.

తమ నోటికి ఎంత మాట వస్తే అంత అంటూ ప్రతిపక్షంలోని వారిని పూర్తిగా అవమానించారు. అంతే కాదు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు. దాంతో ఆ ఓట్లు మొత్తం కూటమికే వెళ్లాయి. చంద్రబాబుని జైలులో పెడితే అప్పటిదాకా యాక్టివ్ గా లేని క్యాడర్ మొత్తం రీచార్జితో రెడీ అయిపోయింది.

అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంది వచ్చి కూటమికి అనుకూలంగా పనిచేశారు. అనేక దేశాల నుంచి స్వచ్చందంగా వచ్చి నిధులు ఇచ్చారు. తమ శ్రమను కూడా పెట్టి గెలిపించారు. జగన్ కి మాత్రం ఎవరూ ప్రచారం చేయలేదు. ఎందుకంటే సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆ ఓట్లు మావి కావు ఈ ఓట్లు మావి కావు అని మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు.

ఇక మరో మాజీ మంత్రి కొడాలి నాని ఒక్క ప్రెస్ మీట్ పెడితే వైసీపీ వాళ్ళకి చెందిన పది వేల ఓట్లు పోయాయి. అలాగే రోజా పేర్ని నాని వచ్చి మీడియా ముందు మాట్లాడితే చాలు భారీ ఎత్తున వైసీపీ ఓట్లకు గండి పడిపోయేది. వీరికి తోడు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇలా ఎవరు వచ్చి మాట్లాడినా వైసీపీ ఓట్లలో కోత పడడమే తప్ప కొత్తగా ఒక్క ఓటు జత కూడిన సందర్భం అయితే లేదు.

ఇక గుడ్డు మంత్రి అని పేరు తెచ్చుకున్న గుడివాడ అమర్నాథ్ కి ఏపీలో అత్యంత భారీ ఓట్ల తేడాతో ఓటమి వరించింది అంటే వాళ్ల మీద జనాలకు ఉన్న కసి ఎలాంటిదో ఈ ఎన్నికలు నిరూపించాయని అంటున్నారు. రాయలసీమలో రెడ్లు అంతా కలసి కట్టకట్టుకుని కూటమికి ఎందుకు ఓట్లు వేసి గెలిపించారో ఇంకా వైసీపీ అధినాయకత్వానికి అర్ధం కాలేదేమో అని అంటున్నారు. లేక అర్ధం అయినా అలా ఉన్నారో కూడా తెలియదు అంటున్నారు.

అధికారంలో ఉన్నపుడు క్యాడర్ కి అన్యాయం జరుగుతోంది అని కొంచెం కూడా చూడకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అంతా కానిచ్చేశారు. దాంతో క్యాడర్ లోకల్ గా ఉన్న లీడర్స్ అంతా జీరోలు అయిపోయారు. దాంతో వాళ్ళందరూ కూడా 2024 ఎన్నికల్లో ఫుల్ సైలెంట్ అయ్యారు.

ఇపుడు వాళ్లందరూ పక్క చూపులు చూస్తున్నారు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో సర్పంచులు అంతా జనసేన వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ బిల్లులు రావలని అంటున్నారు. ఇక జగన్ అధికారంలో ఉంటూ తన సొంత నియోజకవర్గం పులివెందులలోనే పనులు చేసిన కౌన్సిలర్లకు బిల్లులు 250 కోట్ల రూపాయలు క్లియర్ చేయలేకపోయారు అని అంటున్నారు.

మరి ఏమి ప్రభుత్వ పాలన చేశారో అర్ధం కావడం లేదు అని అంటున్నారు. వినుకొండలో జరిగిన ఒక మర్డర్ కి జగన్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అదే వైసీపీ అధికారంలో ఉన్నపుడే జగన్ ఇలా క్యాడర్ కి అండగా నిలిచి మాట్లాడి ఉంటే వారికి భరోసా ఇచ్చి ఉంటే వారికి విలువ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని అంటున్నారు.

సీఎం గా ఉన్నపుడు జగన్ ఆ రోజున క్యాడర్ కి లీడర్ కి అపాయింట్మెంట్ ఇవ్వకుండా గ్రౌండ్ లెవెల్ లో ఏమి జరుగుతోంది అన్నది తెలుసుకోకుండా వ్యవహరించారు అని అంటున్నారు. అంతా సీఎం ఓ ఆఫీస్ మీద భారం వేశారని కొంతమందికే అప్పగించారు అని అంటున్నారు. అయితే వాళ్లే వైసీపీని సర్వనాశనం చేశారు అని అంటున్నారు.

పార్టీకి క్యాడర్ ఎపుడూ వెన్నుపూసతో సమానం. అది ఏమాత్రం పట్టించుకోకుండా వాలంటీర్ల ద్వారా అంతా నడిపించారని అంతా అయ్యాక ఇపుడు తాము ఏమి చేస్తామని క్యాడర్ అంటోంది. ఇక ఇపుడు క్యాడర్ అయితే బయటకు వచ్చి హడావుడి చేసే పరిస్థితి లేదు అని అంటున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం పెట్టే కేసులను భరించే ఓపిక వారికి లేదు అని అంటున్నారు. ఇక వారు కేసులలో ఇరుక్కుంటే వైసీపీ లీగల్ గా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తుందన్న గ్యారంటీ కూడా లేదు అని అంటున్నారు.

మొత్తానికి ఒక ఒక సీఎం ఓ ప్లస్ ఒక సలహాదారుడు అంతా కలసి వైసీపీని ముంచేశారు అని అంటున్నారు. వైసీపీ 2024 లో ఓడేది కాదు ఎంత తగ్గినా 100 సీట్లతో అయినా అధికారం అందుకే సీన్ ఉండేది. కానీ ఆ పార్టీకి ఏ కీలు కి ఆ కీలు విరిచేసే విధంగా తప్పుడు వ్యూహాలతో చేసిన రాజకీయ మూలంగానే ఇంతకు ఇంతా అనుభవించాల్సి వస్తోందని అంటున్నారు.