Begin typing your search above and press return to search.

వైసీపీకి గుడ్ బై కొట్టిన ఎమ్మెల్యే కాపు

వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై కొట్టారు. తనకు సీటు ఇవ్వలేదని వైసీపీ అధినాయకత్వం మీద ఆయన మండిపడ్డారు.

By:  Tupaki Desk   |   5 Jan 2024 3:24 PM GMT
వైసీపీకి గుడ్ బై కొట్టిన ఎమ్మెల్యే కాపు
X

వైసీపీకి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గుడ్ బై కొట్టారు. తనకు సీటు ఇవ్వలేదని వైసీపీ అధినాయకత్వం మీద ఆయన మండిపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా రాయదుర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తన సతీమణి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే కాపు రమచంద్రారెడ్డికి ఈసారి సీటు కష్టమే అన్న ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. ఆయనకు అక్కడ చెప్పాల్సింది చేప్పారు. ఈసారి ఆయనకు టికెట్ దక్కే చాన్స్ లేదని కూడా భోగట్టా వచ్చేసింది.

దాంతో కాపు ఒక్క లెక్కన ఫైర్ అయ్యారు. తనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నమ్మించి గొంతు కోశారు అని ఆయన మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లో ఉంటే తీసుకుని వచ్చి ఇలా చేశారు అని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే కాపు రామచంద్రారెడ్డి ప్లేస్ లో అభ్యర్ధి కూడా వైసీపీ డిసైడ్ చేసింది అని అంటున్నారు. మెట్టు గోవింద రెడ్డికి రాయదుర్గం నుంచి ఈసారి టికెట్ ఇస్తారని అంటున్నారు. అయితే కాపు మాత్రం తనకు టికెట్ కావాలని పట్టు బట్టారని అంటున్నారు.

అయితే ఆయన పనితీరు పట్ల సర్వేలలో వచ్చిన వ్యతిరేకత కారణంగానే సీటుని అధినాయకత్వం నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను అని కాపు ప్రకటించినా ఆయన నోటి వెంట కాంగ్రెస్ అన్న మాట కూడా వచ్చింది. పైగా తన భార్యకు మరో సీటు అంటున్నారు.

దాంతో ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారని అంటున్నారు. ఏది ఏమైనా కాపు రామచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేయడం చర్చనీయాంశం అయింది. మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి జగన్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని కాపు చేసిన కామెంట్శ్ కూడా వేడి పుట్టిస్తున్నాయి. ఆయన రూట్ ఎటు అన్నది తొందరలో తెలుస్తుంది అని అంటున్నారు.