Begin typing your search above and press return to search.

ఆళ్ళ నాని కోపమంతా ఆయన మీదేనా ?

ఆ తరువాత కూడా అధినాయకత్వం ఏలూరు జిల్లా విషయంలో తన ఆలోచనలు ఏంటో చెప్పకుండా ఉండడంతో నాని తన దారి తాను చూసుకున్నారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 4:12 AM GMT
ఆళ్ళ నాని కోపమంతా ఆయన మీదేనా ?
X

ఆళ్ల నాని కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన నేత. ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచారు. ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ గా జగన్ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఆళ్ల నాని అంటే జగన్ కి తోడూ నీడ అనుకునేవారు. అలాంటి నాని ఇపుడు వైసీపీకి దూరం అయిపోయారు. ఆయన అలా దూరం అయిన తీరే ఒక వ్యూహంగా ఉంది. ఆయన దశల వారీగా తప్పుకునే కార్యక్రమం తీసుకున్నారు.

మొదట పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దాంతో ఆనాడే ఆయన వైసీపీకి గుడ్ బై కొట్టారు అని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా ఆయన మరో బాంబు పేల్చారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా లెటర్ రాసి సంచలనం సృష్టించారు.

అంటే ఆయన వైసీపీకి దూరం అవుతూ కూడా సైలెంట్ గా డ్యామేజ్ చేయాల్సింది చేస్తున్నారు అని అంటున్నారు. ఆళ్ళ నాని పార్టీ పదవులకు రాజీనామా చేశాక జగన్ ఆయనను పిలిచి మాట్లాడలేదా అన్న చర్చ సాగుతోంది. అది జరగకపోవడం వల్లనే ఆయన మరో అస్త్రాన్ని సంధించి ఏకంగా ప్రాథమిక సభ్యత్వం అని చెప్పారని అంటున్నారు.

ఆళ్ళ జిల్లా ప్రెసిడెంట్ గా ఉన్నా పార్టీ ఎత్తిగిల్లదు అని హై కమాండ్ కి ఒక సిగ్నల్ వచ్చింది అని ఒక ప్రచారం ఉంది. ఆయనను 2022లో మంత్రి పదవి నుంచి తప్పించాక అప్పటి నుంచే అధినాయకత్వం గ్యాప్ ఏర్పడింది అని కూడా అంటున్నారు. 2024 ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వడానికి ఒక చిన్నపాటి టెన్షన్ పెట్టేశారు అని కూడా అంటున్నారు.

ఇక పార్టీ ఓడింది.అందరితో పాటు ఆళ్ళ నాని కూడా మునిగారు. దాంతో నిండా మునిగాక మొహమాటం ఎందుకు అని ఆయన సైలెంట్ అయ్యారు. ఆ తరువాత కూడా అధినాయకత్వం ఏలూరు జిల్లా విషయంలో తన ఆలోచనలు ఏంటో చెప్పకుండా ఉండడంతో నాని తన దారి తాను చూసుకున్నారు అని అంటున్నారు.

ఆయన తన రాజీనామా వ్యక్తిగతం అంటున్నారు. తాను రాజకీయాల నుంచి దూరం అని చెబుతున్నా ఆయన ఆలోచించుకోవడానికి బోలెడంత టైం ఉంది. అందుకే ప్రస్తుతానికి పాలిటిక్స్ కి క్విట్ అనేశారు. మరో వైపు చూస్తే హై కమాండ్ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఆళ్ళ నాని రాజీనామా వ్యవహారం చెబుతోంది అని అంటున్నారు.

ఎవరు రాజీనామా చేసినా తమ యాక్షన్ ప్లాన్ తమకు ఉందని జనాలే తమకు ముఖ్యం అన్నట్లుగా హై కమాండ్ చెప్పకనే చెబుతోంది. ఒకసారి జనాలు ఆదరిస్తే అందరూ వెనక్కి వస్తారు అన్న ధీమా కూడా వైసీపీ పెద్దలకు ఉంది అని అంటున్నారు. ఇక ఆళ్ళ నానికి పార్టీ ఎంతో చేసింది అని ఆయన వల్ల పార్టీకి దక్కింది చూసుకుంటే ఇచ్చిందే ఎక్కువ అన్న మాట కూడా కొందరి నుంచి వస్తోంది.

అయితే ఆళ్ళ నాని అని కాదు వైసీపీకి పనిచేసిన సీనియర్ లీడర్లు ఎవరు అయినా వారిని పిలిచి మాట్లాడితే బాగుంటుంది కదా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఆళ్ళ నాని పోతూ పోతూ వైసీపీ మొత్తానికి ఒక సందేశం ఇచ్చేశారా అన్న చర్చ నడుస్తోంది. ఇవాళ నేనూ రేపు మీరూ అన్నట్లుగా ఆయన చెప్పాల్సింది చెప్పేశారా ఆ విధంగా పనిచేసే వారిని ఆయన రాజకీయ వైరాగ్యం ఒక సంకేతం ఇచ్చిందా అన్న చర్చ అయితే ఉంది.

చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా వెళ్ళిన వారు పోయిన వారూ పోతూ ఉంటారు. వారిని తెచ్చి బతిమాలినా ఉండరు కదా అన్న థియరీ కూడా వైసీపీ పెద్దలకు ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఒక్కటే మాట. పళ్ళున చెట్టు వైపే అందరి చూపూ ఉంటుంది. బెల్లం చుట్టూ ఈగలు వాలుతాయి. అలాగే ఇపుడు వైసీపీ అనే వృక్షం శిశిరంలో ఉంది దాంతో ఏదైనా ఆశించిన వారు అయితే ఎవరూ ఉండరని కూడా అంటున్నారు.