వైసీపీ నేత పీవీపీ హాట్ ట్వీట్ ఎవరి కోసం!
దాని భావమేమి అంటే ఎవరికి ఎంత అర్ధం అయితే అంత లోతుగా చదువుకోవడమే అని అంటున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2023 12:13 PM GMTఅపుడెపుడో అంటే 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటుకు వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సినీ నిర్మాత వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ అలియాస్ పీవీపీ తాజాగా ట్విట్టర్ లో ఒక ట్వీట్ టీటారు. దాని భావమేమి అంటే ఎవరికి ఎంత అర్ధం అయితే అంత లోతుగా చదువుకోవడమే అని అంటున్నారు.
ఇంతకీ పీవీపీ ఏమి ట్వీటారూ అంటే వాపుకీ బలానికీ తేడా తెలుసుకోకపోతే బాహుబలిని బ్రహ్మానందాన్ని జననేతనూ జోకర్ని చేస్తారు ఓటరు మహాశయులు...సర్వే జనా సుఖినోభవంతు అంటూ చెప్పాల్సింది చెప్పేశారు. అయితే ఈ సందేశం ఎవరికీ అన్నదే అర్ధం కావడంలేదు.
ఆయన వైసీపీలో ఉన్నారంటే ఉన్నారు. కానీ యాక్టివ్ రోల్ ఏమీ ప్లే చేయడంలేదు. ఎంపీ అభ్యర్ధిగా ఓడాక ఆయన వైసీపీలో కనిపించడం తగ్గించేశారు. అయితే ఆయన సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే కనిపిస్తారు. తన ట్విట్టర్ కి ఆయన ఎప్పటికపుడు పనిచెబుతూ ఉంటారు.
అందులో సందేహాలు సందేశాలు కూడా ఉంటాయి. ఇపుడు ఈ సందేశం ఎవరికి అన్న సందేశమే కలుగుతోంది. బాహుబలులు ఎవరు, జననేతలు ఎవరు వాపుని చూసి బలం అనుకుంటున్నది ఎవరు ఇత్యాది ప్రశ్నలు ఒక్క ట్వీట్ తో కలుగచేశారు పీవీపీ వారు.
అయితే తక్షణం చూస్తే తెలంగాణా ఎన్నికల ఫలితాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. తెలంగాణా రాజకీయ బాహుబలిగా ఓటమెరుగని నేతగా కేసీయార్ కనిపిస్తున్నారు. అలాంటి ఆయన్ని ఓడించేశారు జనాలు. హాట్ హాట్ గా అదే ఇపుడు డిస్కషన్ గా ఉంది.
మరి దాని మీద పీవీపీ ఈ ట్వీట్ చేశారా లేక బలముందని అనుకుంటూ గెలుపు ధీమాతో ఉన్న మిగిలిన పార్టీల నేతల మీద చేశారా అన్నది చూడాల్సి ఉంది. ప్రజలను తక్కువ చేయవద్దు అన్నది ఎవరైనా చెప్పేదే. అదే టైం లో వాపుని బలాన్ని సరిగ్గా అంచనా వేయకపోతే భంగపడేది రాజకీయ పార్టీల.
కళ్ల ముందు తెలంగాణా ఫలితం ఉంది. రేపు ఎన్నికలు ఏపీలో ఉన్నాయి. మరి పీవీపీ ఈ సందేశం తాను చెప్పాలనుకున్న వారికి ఇలా చెప్పారా అన్నదే చర్చగా ఉంది. ఆయన జనరలైజ్ చేసి చెప్పినా అందులో మంచి మేసేజ్ ఉంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఈ హెచ్చరికను సరిగ్గా ఆర్ధం చేసుకుంటే మాత్రం మంచి ఫలితాలు ఉంటాలి. లేకపోతే పీవీపీ చెప్పినట్లే జోకర్లే అవుతారు.