Begin typing your search above and press return to search.

మంత్రి రోజా ఫ్యామిలీపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు!

అవును... మంత్రి ఆర్కే రోజాపై పుత్తూరు వార్డు కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   23 Jan 2024 12:18 PM GMT
మంత్రి రోజా ఫ్యామిలీపై వైసీపీ నేత సంచలన ఆరోపణలు!
X

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఇప్పటికే సీఎం జగన్ ప్రజల్లో వ్యతిరేకత, ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరిస్తున్నారని.. వారి స్థానంలో కొత్త ఇన్ ఛార్జ్ లను నియమిస్తున్నారని చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి ఆర్కే రోజాకు ఊహించని పరిణామం ఎదరైంది. ఆమె ఫ్యామిలీపై వైసీపీ నేత ఒకరు తీవ్ర ఆరోపణలు చేశారు.

అవును... మంత్రి ఆర్కే రోజాపై పుత్తూరు వార్డు కౌన్సిలర్ సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా.. పుత్తురు ముసిపల్ చైర్మన్ పదవిని అమ్ముకున్నారన్నట్లుగా ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో చైర్మన్ పదవి కోసం రూ. 40 లక్షలు డిమాండ్ చేశారని చెప్పిన అమె... అడిగినన్ని డబ్బులు ఇచ్చినా తమకు పదవి ఇవ్వలేదని.. అనంతరం తిరిగి తమ డబ్బులు తమకు ఇవ్వాలన్నా రెస్పాండ్ కావడం లేదని మీడియా ముందు తెలిపారు.

వివరాళ్లోకి వెళ్తే... పుత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డు కౌన్సిలర్ భువనేశ్వరి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సమయంలో... మంత్రి ఆర్కే రోజా, ఆమె సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... తమకు రిజర్వేషన్ కలిసి రావడంతో పుత్తూరు మున్సిపల్‌ చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పారని.. అయితే పుత్తురుకు ఇన్ ఛార్జ్ గా ఉన్న రోజా సోదరుడు అందుకు పెద్ద మెత్తంలో డబ్బు డిమాండ్ చేశారని ఆరోపించారు.

ఈ క్రమంలో... తాము రూ.40 లక్షలు ముట్టజెప్పామని.. మంత్రి సోదరుడు కుమార స్వామి రెడ్డికి మూడు దఫాలుగా ఈ రూ.40 లక్షల సొమ్మును ఇచ్చామని ఆమె వెల్లడించారు! ఇలా సొమ్ము ముట్టచెప్పినా కూడా తమకు చైర్మన్ పదవి ఇవ్వకపోగా.. ఆ డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని... ఈ విషయంపై రోజాకు మెసేజ్ పెడితే ఆమె చూసి ఊరుకున్నారని.. భువనేశ్వరి మీడియా ముందు చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ఇక ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పిన భువనేశ్వరి... ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు! దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.