Begin typing your search above and press return to search.

ఫిబ్రవరిలో వైసీపీ మ్యానిఫేస్టో...!

కేవలం మూడే మూడు పేజీలు ఈ మేనిఫేస్టో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా మేనిఫేస్టో ఎపుడు రిలీజ్ అన్న దానికి వైసీపీలో ఎవరూ చెప్పకుండానే జగనే స్వయంగా చెప్పేశారు.

By:  Tupaki Desk   |   10 Oct 2023 3:15 AM GMT
ఫిబ్రవరిలో  వైసీపీ మ్యానిఫేస్టో...!
X

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫేస్టో ఎపుడు వస్తుంది అన్న చర్చ అయితే ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే ఇప్పటికే మినీ మేని ఫేస్టోని రిలీజ్ చేసింది. పూర్తి స్థాయి మేనిఫేస్టో ఈ దసరాకు రిలీజ్ అని అనుకుంది కానీ చంద్రబాబు అరెస్ట్ తో అది వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో టీడీపీ మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే మేనిఫేస్టోని రిలీజ్ చేసే కార్యక్రమం పూర్తి చేస్తుంది అని అంటున్నారు.

ఇక వైసీపీ మేనిఫెస్టో విషయంలో కూడా కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. 2019 ఎన్నికలకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు ఉన్నారు. ఇపుడు కూడా ఆయనకే బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఆయనతో పాటు పలువురు సీనియర్లను కమిటీలో పెట్టి తొందరలో కసరత్తు మొదలెడతారు అని తెలుస్తోంది.

ఈసారి మేనిఫేస్టోలో ఏ ఒక్క సెక్షన్ ని వదలరాదు అని వైసీపీ భావిస్తోంది. అలాగే రైతులకు పెద్ద పీట వేయాలని అనుకుంటోంది. ఇదిలా ఉంటే వైసీపీ మేనిఫెస్టో కమిటీని త్వరలో ఖరారు చేసి ప్రకటిస్తారు అని అంటున్నారు. మూడు నెలల పాటు ఈ కమిటీ అధ్యయనం చేసి మరీ వైసీపీ ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తుంది అని అంటున్నారు.

దానికి కొత్త సంవత్సరం తొలి ఏడాది మొదట్లో ఆమోదించి ఫిబ్రవరిలో జగన్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తారని అంటున్నారు. కేవలం మూడే మూడు పేజీలు ఈ మేనిఫేస్టో ఉంటుందని అంటున్నారు. ఇదిలా ఉండగా మేనిఫేస్టో ఎపుడు రిలీజ్ అన్న దానికి వైసీపీలో ఎవరూ చెప్పకుండానే జగనే స్వయంగా చెప్పేశారు.

పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరిలో పార్టీ క్యాడర్ అంతా ఇంటింటికీ వెళ్ళి ఇదీ మా జగన్న ఇస్తున్న మేని ఫేస్టో అంటూ పంపిణీ చేస్తారని ప్రకటించారు. అంటే ఫిబ్రవరిలోనే వైసీపీ ఎన్నికల ప్రణాళిక ఏంటి అన్నది తెలుస్తుంది అంటున్నారు.

అప్పటికి టీడీపీ ఎన్నికల ప్రణాళిక రిలీజ్ అవుతుంది. జనసేనతో పొత్తు నేపధ్యంలో ఉమ్మడిగానే రెండు పార్టీలు రిలీజ్ చేస్తాయి. దాంతో వారు ఏమి చెప్పారన్నది కూడా తెలుస్తుంది. ఇక విపక్షాలు ఏ ఏ హామీలు ఇచ్చాయన్నది వైసీపీ కానీ జగన్ కానీ అసలు పట్టించుకోవడంలేదు అంటున్నారు. తాను చెప్పిన ప్రతీ మాట నెరవేర్చాం కాబట్టి తాము కట్టుబడి ఉన్న వాటినే ఎన్నికల హామీలుగా ఇస్తామని అంటున్నారు. మొత్తానికి వైసీపీ ఎన్నికల ప్రణాళిక రావాలంటే మరో నాలుగు నెలల సమయం పడుతుంది అని అంటున్నారు. సో అంత వరకూ వెయిటింగే మరి.