మంత్రులకు డేంజర్ బెల్స్...!?
ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే రాయల సీమ జిల్లాల వరకూ కొంతమంది మంత్రులకు టీడీపీ కూటమి నుంచి గట్టి పోటీ ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 30 March 2024 2:30 AM GMTవైసీపీలో నోరున్న పేరున్న మంత్రులకు ఈసారి ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఎదురుకాబోతోందా అన్న చర్చ సాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే రాయల సీమ జిల్లాల వరకూ కొంతమంది మంత్రులకు టీడీపీ కూటమి నుంచి గట్టి పోటీ ఉందని అంటున్నారు.
ఉత్తరాంధ్రా జిల్లాలలో చూస్తే శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదరి అప్పలరాజు ఇప్పటివరకూ ఉన్న అంచనాల మేరకు సేఫ్ జోన్ లోనే ఉన్నారని అంటున్నారు. విజయనగరంలో ఇద్దరు మంత్రులు బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర కచ్చితంగా గెలుస్తారని అంటున్నారు. విశాఖ జిల్లాలోని ఇద్దరు మంత్రులలో బూడి ముత్యాలనాయుడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు.
ఆయన అక్కడ టఫ్ ఫైట్ ని ఎదుర్కోబోతున్నారు అని అంటున్నారు. ఇక గాజువాకలో పోటీ చేస్తున్న మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ కి టీడీపీ కూటమి గట్టి సవాల్ విసురుతోందని అంటున్నారు. గోదావరి జిల్లాల విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణ టీడీపీ అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఢీ కొడుతున్నారు. ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తోందని అంటున్నారు
గుంటూరు జిల్లా విషయానికి వస్తే సత్తెనపల్లిలో టీడీపీ కూటమితో మంత్రి అంబటి రాంబాబు ఎదురు నిలిచారు. ఆయనకు కూడా బలమైన పోటీ ఉందని అంటున్నారు. క్రిష్ణా జిల్లాలో పెనమలూరు నుంచి పోటీ చేస్తున్న మంత్రి జోగి రమేష్ కి కూడా భీకరమైన పోరు ఎదురుగా ఉందని ఆయన గెలుపు కోసం కష్టపడాల్సిందే అంటున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే మంత్రి అయిన ఆర్కే రోజాకు సొంత పార్టీతో పాటు ప్రత్యర్ధి అయిన టీడీపీ కూటమి నుంచి తీవ్రమైన పోటీ ఉందని అంటున్నారు. దాంతో రోజా నగరిలో హ్యాట్రిక్ విజయం కోసం కష్టించాల్సి ఉందని అంటున్నారు. అలాగే అనంతపురంలో ఒక మహిళా మంత్రి కూడా గెలుపు కోసం ఎదురీదాల్సి ఉంటుందని అంటున్నారు
మొత్తంగా చూసుకుంటే కనుక అరడజన్ మందికి పైగా వైసీపీ మంత్రులు ఈసారి విజయం కోసం గట్టిగా పరిశ్రమించాల్సిందే అని వస్తున్న సర్వేలు వేసుకుంటున్న అంచనాలు చెబుతున్నాయి. రానున్న రోజులు కీలకంగా మారబోతున్నాయి వీటిని అధిగమిస్తూ గెలుపు కోసం అనుకూల వాతావరణం సృష్టించుకుంటేనే ఈ మంత్రులకు విజయం దగ్గరకు వస్తుందని అంటున్నారు.
అయితే చేతిలో సమయం ఉంది జగన్ బస్సు యాత్ర తరువాత మార్పు ఉండవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పరిస్థితి వీరికి కొంత ప్రతికూలంగా ఉన్నా చివరికి అనుకోని మలుపులు సంభవించి గెలుపు తమ వైపు వస్తుందని ఆశాభావంగా వైసీపీ శ్రేణులు ఉన్నాయని అంటున్నారు.