Begin typing your search above and press return to search.

వైసీపీ ఎమ్మెల్యే ప్రపోజల్.. సౌండ్ లేని టీడీపీ అభ్యర్థి!

ఇలాంటివేళ.. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒక షాకింగ్ ప్రపోజల్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 9:30 AM GMT
వైసీపీ ఎమ్మెల్యే ప్రపోజల్.. సౌండ్ లేని టీడీపీ అభ్యర్థి!
X

రాజకీయాలు అన్న తర్వాత వాదనలు.. ప్రతివాదనలు.. విమర్శ.. ప్రతివిమర్శ కామన్. అదే సమయంలో సవాళ్లు.. ప్రతిసవాళ్లు కూడా చూస్తుంటాం. అయితే.. ఇవన్నీ కూడా సేఫ్ గేమ్ తరహాలోనే ఉంటాయి తప్పించి.. రిస్కుతో కూడినవి ఉండవు. అందుకు భిన్నంగా వైసీపీ ఎమ్మెల్సీ ఒకరు తెర మీదకు తీసుకొచ్చిన ప్రపోజల్ చూస్తే.. ఆయన ఆత్మవిశ్వాసం ఎంతన్న విషయం ఇట్టే అర్థం అవుతుంటే.. అందుకు ధీటుగా బదులు ఇవ్వాల్సిన ఆయన రాజకీయ ప్రత్యర్థి.. టీడీపీ అభ్యర్థి మాత్రం సైలెంట్ గా ఉండిపోవటం ఆసక్తికర చర్చకు కారణంగా మారిందని చెప్పాలి.

తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించటం తెలిసిందే. పొత్తు ధర్మంలో భాగంగా తమకు కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారని జనసేనాని పవన్ తో సహా ఆ పార్టీనేతలు కస్సుమనటం తెలిసిందే. చంద్రబాబు నోటి నుంచి టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల కన్ఫర్మ్ కావటంతో ఆయన ఎన్నికల ప్రచారానికి రెఢీ అవుతున్నారు. ఇందులో భాగంగా వైసీపీ సర్కారుపై విమర్శలు చేస్తూ.. డెవలప్ మెంట్ ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటివేళ.. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఒక షాకింగ్ ప్రపోజల్ ను తెర మీదకు తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని కేశవరం గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రైవేటు ఎన్నిక పెడదామని.. అందులో ఎవరు గెలిస్తే వారు ఎమ్మెల్యేగా ఏకగ్రీవం అవుదామని.. ఓడిన వారు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని కోరారు. సవాలుతో కూడిన షాకింగ్ ప్రపోజల్ ను తీసుకొచ్చిన తోట త్రిమూర్తుల మాట ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఓడిన అభ్యర్థి ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలన్న త్రిమూర్తుల మాటకు టీడీపీ అభ్యర్థి నోటి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవటం చర్చగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ ప్రపోజల్ కు ధీటుగా మరో ప్రపోజల్ ను తీసుకు వచ్చినా బాగుండేదని.. అందుకు భిన్నంగా మౌనంగా ఉండటం సరిగా లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.