Begin typing your search above and press return to search.

ఈసారి ఎంపీ అభ్యర్ధులతో వైసీపీ లిస్ట్....!?

ఇప్పటికే కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినాయకత్వం నాలుగవ జాబితాలో ఏకంగా తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే వీలుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 9:12 AM GMT
ఈసారి ఎంపీ అభ్యర్ధులతో వైసీపీ లిస్ట్....!?
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధుల ఎంపిక మీద ఫుల్ ఫోకస్ పెట్టేశారు. నాలుగవ జాబితా రిలీజ్ అంటున్నారు. అయితే ఆ జాబితా రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ అయింది. ఇదిలా ఉంటే నాలుగవ జాబితా కోసం వైసీపీ అధినాయకత్వం తుది కసరత్తు చేస్తోంది అని అంటున్నారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఫుల్ బిజీగా ఉన్నారని అంటున్నారు.

అంతే కాదు, అవసరమైన వారికి ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. అలా చాలా మంది కీలక నేతలు కూడా వచ్చి కలిశారు. ఈసారి ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ఎంపీ అభ్యర్ధులే ఎక్కువ మంది ఉంటారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినాయకత్వం నాలుగవ జాబితాలో ఏకంగా తొమ్మిది మంది ఎంపీ అభ్యర్ధులను ప్రకటించే వీలుందని తెలుస్తోంది.

ఈ మేరకు ముమ్మరంగా కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. నాలుగో జాబితాలో నర్సరావుపేట, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి, కాకినాడ, బాపట్ల, కడప, రాజంపేట, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్దులను జగన్ ప్రకటించే వీలు ఉందని అంటున్నారు. నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీక్రిష్ణదేవరాయలును గుంటూరుకు పంపించి అక్కడ బీసీ అభ్యర్ధిని ఎంపిక చేస్తారని అంటున్నారు.

అలగే రాజమండ్రి విషయంలో సినీ డైరెక్టర్ వీవీ వినాయక్ పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు. అలా కాకుంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వారికే ఆ సీటు ఇస్తారని తెలుస్తొంది. ఇక కాకినాడకు చలమలశెట్టి సునీల్ కి వైసీపీ సీటు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎంపీగా పోటీ చేయడం దీంతో నాలుగవ సారి అవుతుంది.

బాపట్ల సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ ప్లేస్ లో కొత్త ముఖానికి చాన్స్ ఇస్తారని అంటున్నారు. సురేష్ కి ఎమ్మెల్యే సీటు ఇవ్వవచ్చు అని అంటున్నారు. కడప విషయంలో సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పేరే వినిపిస్తోంది. కానీ పరిణామాలు మారితే కనుక అక్కడ నుంచి పోటీకి కొత్త వారు రావచ్చు. మైనారిటీ వర్గానికి చెందిన మంత్రి పేరు కూడా వినిపిస్తోంది.

రాజంపెటంకు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఖరారు చేయడం కచ్చితం అని అంటున్నారు. ఒంగోలు ఎంపీ విషయంలో మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి ప్లేస్ లో కొత్త వారికి దింపుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఈసారి జాబితాలో ఎంపీల పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు.