Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా!

టిక్కెట్లు దగ్గని నేతలు, నియోజకవర్గాల మార్పుకు అంగీకరించని సిట్టింగులు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Jan 2024 6:30 AM GMT
బిగ్  బ్రేకింగ్... వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు రాజీనామా!
X

టిక్కెట్లు దగ్గని నేతలు, నియోజకవర్గాల మార్పుకు అంగీకరించని సిట్టింగులు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణలు, సర్వే ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలను ప్రాతిపధికగా తీసుకుని జగన్.. అభ్యర్థులను ఎంపీక చేయడం.. పలు నియోజకవర్గాల్లో మార్పులు చేయడం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ మార్పులు నచ్చక పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ఈ సమయంలో నరసరావుపేట ఎంపీ వైసీపీకి రాజీనామా చేశారు.

అవును... నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తన ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన రాజకీయంగా అనిశ్చితి నెలకొందని, ఆ అనిశ్చితికి కారణం కాని, ఆ అనిశ్చితిని కోరుకుంది కానీ తాను కాదని వెల్లడించారు. ఈ అనిశ్చితివల్ల తనకు కానీ పార్టీకి కానీ ప్రయోజనం లేదని.. మరి ముఖ్యంగా కేడర్ కన్ ఫ్యూజన్ లో ఉన్నారని అన్నారు.

ఈ పరిస్థితులకు ఏదో విధంగా తెరదించాలనే ఉద్దేశ్యంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక గత 15 రోజులుగా కొత్త అభ్యర్థిని తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందువల్ల అంతా కన్ ఫ్యూజన్ కి గురవుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు లావు తెలిపారు.

కాగా... నాలుగు రోజుల క్రితం నారా లోకేష్‌ తో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారంటూ స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఆయన పార్టీ మారడానికి సన్నాహాలు చేస్తున్నారని కథనాలొచ్చాయి. ఈ క్రమంలో జనవరి 22 నే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే ఈ నెల 22న చంద్రబాబు అయోధ్య టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన రాజీనామా ఈరోజుకు పోస్ట్ పోన్ అయ్యిందని చెబుతున్నారు. దీంతో... ఇవాళ, రేపట్లో శ్రీకృష్ణదేవరాయులు టీడీపీ కండువా కప్పుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

వాస్తవానికి లావు శ్రీకృష్ణదేవరాయులు పార్టీకి రాజీనామా చేయడంపై గత రెండు మూడు వారాలుగా స్థానికంగా చర్చ నడుస్తుంది. వైసీపీ అధిష్టాణం లావుని ఈదఫా గుంటూరు లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయమని చెప్పిందని.. అయితే అందుకు శ్రీకృష్ణదేవరాయులు సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. కేవలం ఈ కారణంతోనే ఆయన పార్టీకి రాజీనామా చేశారని చెబుతున్నారు.