Begin typing your search above and press return to search.

ఒకటి మినహా... 25 జిల్లాలోని వైసీపీ ఆఫీసులు కూల్చేయొచ్చా?

అయితే... ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేటాయించబడ్డాయా.. లేక, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటాయించబడ్డాయా.. అనేది తేలాల్సి ఉంది!

By:  Tupaki Desk   |   23 Jun 2024 4:20 AM GMT
ఒకటి మినహా... 25 జిల్లాలోని వైసీపీ  ఆఫీసులు కూల్చేయొచ్చా?
X

ప్రస్తుతం ఏపీలో రుషికొండ భవనలా తర్వాత వైసీపీ కార్యాలయం కూల్చివేత అనే అంశం ఎంత హాట్ టాపిక్ గా మారిందనేది తెలిసిన విషయమే. శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని సీఆర్డీయే అధికారులు కూల్చివేశారు! దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది. చంద్రబాబు కూడా కూల్చివేతలతోనే పాలన మొదలుపెట్టారనే కామెంట్లు వినిపించాయి.

ఇది పూర్తిగా చట్ట విరుద్దం అని.. సీఆర్డీయే చట్టాలు మరో విధంగా ఉన్నాయని.. కోర్టు ఆదేశాలను దిక్కరించి ఈ కూల్చివేత కార్యక్రమానికి పాల్పడ్డారని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వివరించారు.. ఈ కూల్చివేతకు కారకులైనవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు! అంతకముందు జగన్ "ఎక్స్" వేదికగా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ఇదే క్రమంలో... ఏపీలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదని.. దాని స్థానంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఫైరవుతున్నారు. ఇదే సమయంలో వివిధ జిల్లాలో టీడీపీ ఆఫీసుల కోసం లీజుకి తీసుకున్న ప్రభుత్వ స్థలాలు, లీజు వివరాలు వెల్లడిస్తూ... వీటి సంగతి ఏమిటి చంద్రబాబు అంటూ వైసీపీ వివరాలు వెల్లడించింది!

ఆ సంగతి అలా ఉంటే... రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ వైసీపీ నిర్మిస్తున్న, నిర్మించిన పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవని.. కేవలం ప్రకాశం జిల్లాలోని కార్యలాయనికి మాత్రమే అనుమతి ఉందని.. మిగిలిన 25 జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు అనుమతులు లేవంటూ ఒక కథనం ఇప్పుడు వైరల్ గా మారింది. దీంతో... త్వరలో 25 జిల్లాల్లోని వైసీపీ కార్యాలయాలను ప్రభుత్వం కూల్చివేసే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... తాడేపల్లిలో నిర్మాణంలో వైసీపీ కార్యలయాన్ని కూల్చివేయడంతో ఒక ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. చంద్రబాబు సీనియారిటీకి ఆయన ఎలాంటి అక్రమ నిర్మాణాలనూ సహించరని.. అవి ఏ పార్టీవి అయినా అయిన వదిలిపెట్టే ప్రసక్తి లేదని అంటున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల్లో వైసీపీ ఆఫీసు పరిస్థితి ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.!

ఏపీలోని మెజారిటీ జిల్లాల్లో వైసీపీ కార్యాలయాల నిర్మాణం పూర్తవ్వడం, తుది దశకు చేరుకోవడం, ఇప్పటికే కొన్ని ప్రారంభమైపోవడం వంటి దశల్లో ఉన్నాయి! ఇదే సమయంలో... అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ కోనసీమ, చిత్తురు జిల్లాల్లోని భూములు, నిర్మాణాలకు సంబంధించిన విషయాలు కోర్టులో ఉన్నాయని తెలుస్తుంది.

ఈ నేపథ్యంలో... ఈ మూడు జిల్లాల్లోని ఆఫీసుల సంగతి అలా ఉంచితే... మిగిలిన జిల్లాల్లోని దేనికీ అనుమతులు లేవని అంటున్నారు. ప్రకాశం జిల్లాలోని ఆఫీసుకు మాత్రం అనుమతి ఉందని చెబుతున్నారు. దీంతో... ఈ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఏది ఏమైనా... రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ కలిపి 42.24 ఎకరాల విస్తీర్ణం భూమిని వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించబడ్డాయని.. వీటి విలువ సుమారు రూ.677.50 కోట్లు ఉంటుందని అంటున్నారు. అయితే... ఇవన్నీ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కేటాయించబడ్డాయా.. లేక, గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేటాయించబడ్డాయా.. అనేది తేలాల్సి ఉంది!

ఏది ఏమైనా... శనివారం తెల్లవారుజామున తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసు కూల్చివేత అనంతరం రాజకీయ పార్టీలు, వాటికి కేటాయించబడిన భూమి, కేవలం వందల్లో, వెలల్లో ఉన్న వాటి లీజు విలువ, అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారనే కథనాలు వెరసి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది వేచి చూడాలి!