రాజకీయం అంటే ఇదే.. గురువును మించిన శిష్యులు..!
మొత్తానికి వైసీపీ లో గురువును మించిన శిష్యులు ఉన్నారనే చర్చ జోరుగా సాగుతుండడంగమనార్హం.
By: Tupaki Desk | 26 July 2023 7:37 PM GMTరాజకీయం అంటే.. రాజకీయమే.. ఓనమాలు నేర్పించడం వరకే గురువు. తర్వాత.. ఆ గురువుకే శిష్యులు పొలిటికల్ పాఠాలు నేర్పించేస్తారు. ఇప్పుడు ఏపీ లో వైసీపీ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు పరిశీ లకులు. ఒక్క వైసీపీ అనేకాదు..రాజకీయాలు అంటేనే ఇలా ఉన్నాయని చెబుతున్నారు. గత ఎన్నికల సమయం లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యులుగా ఓ నలుగురు టికెట్లు సంపాయించుకుని విజయం దక్కించుకున్నారు.
అయితే.. వీరి లో ఇద్దరి విషయం లో పెద్దిరెడ్డి యూటర్న్ తీసుకుని టికెట్లు ఇవ్వరాదని ఒత్తిడి చేస్తున్నారు. అయితే.. ఇలాంటి జాబితా లో ఉన్న ఆ ఇద్దరు కూడా సీఎం జగన్ ను మచ్చిక చేసుకుని.. గురువుగారికే చెక్ పెడుతున్నారట. దీంతో వారికి టికెట్లు ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా పెద్దిరెడ్డి ఆ నియోజకవర్గాల జోలికి వెళ్లడం లేదని సమాచారం. అంతేకాదు ముభావంగా కూడా ఉంటున్నారట.
అయితే.. ఆయన అండతోనే గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు పెద్దిరెడ్డి ఆయా నియోజకవర్గాల జోలికి వెళ్లకపోవడం.. పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఇక, రామచంద్రపురం రగడ అందరికీ తెలిసిందే. గురువు గారు.. అంటూనే మంత్రి చెల్లుబోయిన వేణు ఎంపీ బోసు కు ఇక్కడ చెక్ పెడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కాకినాడ రూరల్ కు చెందిన వేణు ను. .ఇక్కడకు తీసుకువచ్చి.. టికెట్ ఇచ్చారు.
అయితే.. ఆయన కు అన్ని విధాలా ప్రోత్సహించిన బోసు కు ఇప్పుడు టికెట్ ఇవ్వొద్దంటూ.. వేణు చేస్తున్న ఒత్తిడికూడా నియోజకవర్గంలో చర్చకు దారితీస్తోంది. ఇక, గత ఎన్నికల్లో కొందరు నాయకులు తప్పుకొని తమ వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. ఇలాంటివారి లో నందిగం సురేష్ ఎంపీ ఒకరు.
ఈయన కు స్థానికంగా ఉన్న రెడ్డి నాయకుడు గురువుగా చెప్పుకొంటారు. కానీ, ఇప్పుడు ఆయన మాటే వినకుండా.. కనీసం.. ఆయన పేరు కూడా మరిచిపోయారని గుంటూరు వైసీపీ లో చర్చసాగుతోంది. మొత్తానికి వైసీపీ లో గురువును మించిన శిష్యులు ఉన్నారనే చర్చ జోరుగా సాగుతుండడంగమనార్హం.