Begin typing your search above and press return to search.

వైసీపీ మూడ్ : విపక్షాలకు అసలు ఏమీ అర్ధం కావడం లేదుట ...?

కానీ వైసీపీలో అలాంటి హడావుడి అయితే కనిపించడంలేదు. తన పని తాను చేసుకుపోతోంది. గట్టిగా చెప్పాలీ అంటే అపుడే అధికారంలోకి వచ్చినంత నిబ్బరంగా ఉంటోంది.

By:  Tupaki Desk   |   17 Aug 2023 2:30 AM GMT
వైసీపీ మూడ్ : విపక్షాలకు  అసలు ఏమీ అర్ధం కావడం లేదుట  ...?
X

ఏపీలో అధికార వైసీపీ తీరు విపక్షాలకు ఏ మాత్రం అర్ధం కాకుండా ఉందా అంటే జవాబు అవును అనే వస్తోంది. పోరాటాలకు కొదవ లేదు. తిరుగుతూనే ఉన్నారు. జనాల్లో కనిపిస్తూనే ఉన్నారు. ఏపీలో ఉన్న జిల్లాలను అన్నీ ఒకటికి పదిమార్లు కలియతిరిగేస్తున్నారు. చుట్టేస్తున్నారు. వెళ్ళిన ప్రతీ చోటా జనాలు బాగా వస్తున్నారు. ఘన స్వాగతాలు కూడా లభిస్తున్నాయి.

అయితే ఇవేమీ తమ గెలుపునకు ఢోకా లేదని చెబుతున్నాయా అంటే ఏపీలోని విపక్షాలకు మాత్రం ఏదో అనిపిస్తోంది అని అంటున్నారు. ఇదే జనం 2019లోనూ వచ్చారు, ఇపుడూ వస్తున్నారు అందువల్ల జనాలు కొలమానమా అంటే అది కాదు, మరేంటి అంటే అదే అర్థం కావడం లేదు.

ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరు చిత్రంగా ఉంది. సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా మొదటి నాలుగేళ్ళూ ఎలా ఉన్నా చివరి ఏడాది మాత్రం చాలా కంగారు పడుతుంది, ఉరుకులు పరుగులు పెడుతుంది. ఎక్కడ లేని దూకుడూ చేస్తుంది.

కానీ వైసీపీలో అలాంటి హడావుడి అయితే కనిపించడంలేదు. తన పని తాను చేసుకుపోతోంది. గట్టిగా చెప్పాలీ అంటే అపుడే అధికారంలోకి వచ్చినంత నిబ్బరంగా ఉంటోంది. ఎన్నికలు చూస్తే ఏడెనిమిది నెలల దగ్గరకు వచ్చినాయి. చమటలు కక్కుతోంది విపక్షం.

కానీ వైసీపీ నుంచి ఎవరూ పెద్దగా జనాల్లకి వెళ్ళడంలేదు. గడప గడపకు అంటూ వైసీపీ ఇచ్చిన కార్యక్రమం మేరకు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు. ఇక స్టార్ కాంపెనియర్ ఎవరూ లేరు. జగన్ అయితే సీఎం గా పరిమితంగానే కొన్ని సభలలో పాల్గొంటున్నారు. రేపటి ఎన్నికల వేళ కూడా జగన్ ఇలాగే తిరుగుతారనే అంటున్నారు.

మరి ఇంతలా ఆకాశం భూమీ కలిపేస్తూ విపక్షాలు హైరానా పడుతూంటే వైసీపీ ఇంతలా కంప్లీట్ రిలాక్స్ మూడ్ లో ఉండడమే ప్రతిపక్షాలకు ఎక్కడ లేని డౌట్లూ కలిగితోంది. ఈ నిబ్బరం వెనక ఉన్న కారణం ఏంటి, ఈ భరోసా వెనక ఉన్న రీజన్ ఏంటి అన్నది ఎంత తరచినా అర్ధం కావడం లేదు అని అంటున్నారు.

వైసీపీ ఇంతలా ధీమా పడుతోంది అంటే గెలుపు ఆశలు కచ్చితంగా ఉండి ఉంటాయి. అందుకే ఆ పార్టీ హాయిగా ఉంది. ఎక్కడా హడావుడి చేయడం లేదు, ఎన్నికలు అన్నవి జస్ట్ లాంచనం అన్నట్లుగా ఉంది అని విపక్షం ఆలోచించడానికి కారణం అవుతోంది. అందుకే విపక్షం మళ్లీ మళ్లీ ఆలోచిస్తోంది. వైసీపీ సంక్షేమ పధకాలను మేము ఆపమని చెప్పుకుంటోంది. ఇంతకు ఇంతా ఇస్తామని కూడా అంటోంది.

మమ్మల్ని నమ్మండి అని కూడా గట్టిగా కోరుతోంది. ఇలా వైసీపీ సైలెంట్ గా నిబ్బరంగా ఉండడం కూడా ఒక వ్యూహమేనా అంటే విపక్షం పడుతున్న మధనాన్ని చూసినా రాజకీయంగా హైరానా పడుతున్న తీరును చూసినా అవును అంతేనేమో అనిపిస్తోంది. ఏది ఏమైనా జనాలకు ఇపుడున్న టైం లో ఇంతటి టెక్నాలజీ పాతుకుపోయిన టైంలో చెప్పాలా అన్నది కూడా ఉంది.

అంటే జనాలకు అన్నీ తెలుసు అన్నదే కనుక వైసీపీ ఆలోచన అయితే అదే వ్యూహం అయితే విపక్షం ఎంత పరుగుపెట్టినా వైసీపీ అంగుళం కూడా కదిలే ప్రసక్తి ఉండదు. అయినా జనాల మూడ్ మార్చే విధంగా ఇప్పటిదాకా విపక్షం కూడా చేసినది పెద్దగా లేదు అన్నదే వైసీపీ ధీమా. మొత్తానికి వైసీపీ మూడ్ చూసి విపక్షానికి అసలు ఏమీ అర్ధం కావడం లేదుట. ఒట్టు అంటున్నారు అంతా.