Begin typing your search above and press return to search.

అంతా ఫుల్ సైలెన్స్... వైసీపీ సక్సెస్ అయినట్లేనా...?

రానున్న రోజులలో వైసీపీ ముమ్మరంగా జనంలోకి వెళ్ళబోతోంది. విపక్షం హ్యాండ్ అప్ అయిన నేపధ్యంలో వైసీపీ జనం బాట పట్టనుంది.

By:  Tupaki Desk   |   10 Oct 2023 7:00 PM GMT
అంతా ఫుల్ సైలెన్స్... వైసీపీ సక్సెస్ అయినట్లేనా...?
X

ఏపీ ఎపుడైనా ఫుల్ సైలెన్స్ గా ఉందా. గత రెండేళ్ళుగా చూస్తే అంటే కరోనా ఇలా తగ్గడమేంటి అలా టీడీపీ జనసేన జనంలోకి వచ్చేశాయి. ఇదేమి ఖర్మ రాష్ట్రానికి అంటూ మొదలెట్టిన చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ మరో కార్యక్రమం కూడా నిర్వహించారు. అంతే కాదు జిల్లాల టూర్లు చేశారు. బాబు ఎంత బిజీ అంటే ఏ ఒక్క రోజూ కూడా ఖాళీగా గత రెండేళ్ళుగా లేరంటే లేరు.

మరో వైపు పవన్ కళ్యాణ్ వారాహీ రధ యాత్రలో ఏపీలో హడావుడి చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి 27 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా మొదలెట్టారు. తడచిన ఎనిమిది నెలల పాటు ఇది ఏపీ హోరెత్తి పోయింది. చంద్రబాబు ఒక చోట, లోకేష్ మరో చోట పవన్ ఇంకో చోట మోత మోగించేశారు.

ముప్పేట దాడితో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయిపోయేది. అందరూ కలసి దండెత్తి వచ్చి మరీ జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేసేవారు. ఎవరికి జవాబు చెప్పాలో తెలియక వైసీపీ మంత్రులు నేతలు తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వైసీపీ పూర్తిగా విపక్షాల ట్రాప్ లో చిక్కుకుని అల్లల్లాడుతున్న టైం అది.

జగన్ ఏ పదిహేను రోజులలో ఒక మీటింగ్ ఏ జిల్లాలోనో నిర్వహించి విపక్షాలకు జవాబు చెప్పేవారు. అయినా ఆ డోస్ అసలు సరిపోయేదు కాదు ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న కొద్దీ విపక్షాలు గేర్ పూర్తిగా మార్చేశాయి. ఈ నేపధ్యం నుంచి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది అధికార పార్టీ.

మొత్తం విపక్షాల చక్రాలు కలియతిరగడానికి మూల విరాట్టు అయిన చంద్రబాబుకే కళ్లెం వేసేలా అరెస్ట్ జరిగింది. ఇది ఎవరూ కలలో కూడా ఊహించని అతి పెద్ద రాజకీయ మలుపు, కుదుపుగా చూడాలి. తనను అరెస్ట్ చేయబోతున్నారు అని అనంతపురం లో చంద్రబాబు చెప్పి ఉన్నారు. అయినా కానీ ఆయనకు కూడా అరెస్ట్ చేయరన్న ధీమా ఉంది. అందుకే ముందస్తు బెయిల్ కి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు.

అయితే వైసీపీ ఇచ్చిన పొలిటికల్ ఝలక్ తో బాబు జైలు పాలు అయ్యారు. నెల రోజుల నుంచి ఆయన జైలు గోడల మధ్య ఉన్నారు. ఈ నెల రోజులలో ఏపీలో టీడీపీ నిరసలను సో సోగా సాగుతున్నాయి. అంతే తప్ప మునుపటిగా గేర్ మార్చినది లేదు.మోతెక్కించే మీటింగ్స్ లేవు పవన్ వారాహి నాలుగవ విడత యాత్ర కూడా మూడు మీటింగ్స్ తో ముగించేశారు.

సరిగ్గా ఇదే అదనుగా వైసీపీ జోరు పెంచేసింది. ఆ పార్టీ యాక్టివిటీ ఫుల్ స్వింగ్ తో స్టార్ట్ అయింది. రానున్న రోజులలో వైసీపీ ముమ్మరంగా జనంలోకి వెళ్ళబోతోంది. విపక్షం హ్యాండ్ అప్ అయిన నేపధ్యంలో వైసీపీ జనం బాట పట్టనుంది. విపక్షాలు ఎపుడు స్పీడ్ అందుకుంటాయంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఈ లోగా ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయి పుణ్యకాలం ముంచుకు వచ్చేస్తోంది. మొత్తానికి చూస్తే వైసీపీ మాస్టర్ ప్లాన్ తో విపక్షం మొత్తం పద్మవ్యూహంలో చిక్కుకుంది అంటున్నారు.