లోకేష్ పప్పు కాదు...కొత్త పేరుతో ర్యాగింగ్ !
నారా లోకేష్ టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలనే చూస్తున్నారు
By: Tupaki Desk | 19 Aug 2024 3:35 AM GMTనారా లోకేష్ టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఆయన ముఖ్యమైన మంత్రిత్వ శాఖలనే చూస్తున్నారు. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో కూడా ఆయన ప్రాధాన్యత బాగా పెరిగింది. లోకేష్ సైతం గతానికి భిన్నంగా బాగానే ఎదిగారు. పార్టీలోని సీనియర్లు సైతం ఈ మాట ఒప్పుకుంటున్నారు.
ఇక రాజకీయ విశ్లేషకులు సైతం లోకేష్ లో మార్పు బాగా వచ్చిందని ఆయన ఇదే విధంగా ఉంటే చంద్రబాబు స్థాయిని కాకపోయినా ఆయనకు సమీపంలోకి రాగలడు అని అంటున్నారు. ఒక విధంగా చూస్తే కాదన్న చోటనే లోకేష్ అవును అనిపించుకున్నారు. ఆయన పని తీరు మాట తీరు అన్నీ బాగానే మారాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ కూడా లోకేష్ లోని మార్పుని గమనిస్తోంది. ఆయనకు ఏమీ తెలియదు పప్పు అని ఒకనాడు ఫుల్ ర్యాగింగ్ చేసి పారేసిన వైసీపీ ఇపుడు ఆయనను హాఫ్ ఫ్యాంట్ అని అంటోంది. నిక్కర్ మంత్రిగా సంభోదిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా టీం లోకేష్ కి ఇచ్చిన ఈ సరికొత్త బిరుదు అనాలో లేక ర్యాంగింగ్ అనాలో ఏమో కానీ ఇందులోనే లోకేష్ గతానికి కంటే ఎదిగాడు అని చెప్పకనే చెబుతున్నారు అని అంటున్నారు.
వైసీపీకి ఏమీ కాని లోకేష్ నిక్కర్ స్థాయి దాకా వచ్చారు అంటేనే సగం విజయమే కదా అన్న మాటా ఉంది. అయినా లోకేష్ గొప్పతనాన్ని వైసీపీ ఎపుడు ఒప్పుకుంది అని టీడీపీ నుంచి కామెంట్స్ పడుతున్నాయి. మరో వైపు చూస్తే లోకేష్ ని నిక్కర్ మంత్రి అని వైసీపీ సోషల్ మీడియా చెలగాటం ఆడితే జగన్ ని పట్టుకొని కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అని టీడీపీ సోషల్ మీడియా చెడుగుడు ఆడుతోంది.
దీనిని చూసిన వారు ఎన్నికలు అయ్యాక ఈ కొత్త ర్యాగింగ్ ఏమిటి అని విస్తుపోతున్నారు. ఎన్నికల ముందు జగన్ ని సైకో అన్న టీడీపీ ఇపుడు ఆయనను కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటోంది. అంటే అధికారం సహా అన్నీ ఆయనకు లేకుండా పోయాయని టీడీపీ వ్యంగ్యం అన్న మాట.
అదే సమయంలో మా నేతకు నిక్కర్ ఉంది, మీకు అది కూడా లేదు కదా అన్న ఎద్దేవా కూడా ఆ కామెంట్స్ లో ఉంది. మొత్తం మీద చూస్తే ఈ రాజకీయ పరిభాష కానీ ఈ విమర్శలు కానీ హద్దులు ఎపుడో దాటేసాయని ఇపుడు దిగజారిపోయాయని అంటున్నారు. ఇంకో వైపు నుంచి చూస్తే సోషల్ మీడియా యుగంలో పాలిటిక్స్ లో పెద్ద నాయకుల నుంచి అందరినీ పర్సనల్ గా ఎటాక్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని అంటున్నారు. ఇది ఆగేది కాదని ఇకమీదట ఇంతకు మించి జోరు చేసేదిగానే ఉంది అని అంటున్నారు. ఎవరైనా మంచి రాజకీయ భాష హుందా రాజకీయం అని ఆశపడితే మాత్రం పొరబడినట్లే అంటున్నారు.