వైసీపీకి రెడ్డి సిగ్నల్ : కొత్త రెడ్డి నాయకుడిని ఎన్నుకోబోతున్నారా?
దాని నాయకుడు వైఎస్ జగన్ కావడం ఆయన వైఎస్సార్ బ్లడ్ కావడంతో రెడ్లు అంతా తనకు పొలిటికల్ గా అల్టర్నేషన్ అని భావించారు.
By: Tupaki Desk | 3 July 2024 12:30 AM GMTఇది చాలా ఆసక్తికరమైన చర్చగానే చూడాల్సి ఉంది. రెడ్లకు ఒక పార్టీగా ఒకనాడు కాంగ్రెస్ ఉండేది. విభజన తరువాత అది అంతర్ధానం అయిన నేపథ్యంలో వైసీపీ అవతరిరించింది. దాని నాయకుడు వైఎస్ జగన్ కావడం ఆయన వైఎస్సార్ బ్లడ్ కావడంతో రెడ్లు అంతా తనకు పొలిటికల్ గా అల్టర్నేషన్ అని భావించారు.
పదేళ్లు శ్రమపడి వైసీపీని మోశారు. ఈ క్రమంలో తన వృత్తి వ్యాపారాలను అన్నీ కోల్పోయారు. అధికారంలో ఉండే పార్టీలతో పోట్లాడారు. సర్వం సహా వైసీపీ అనుకుని చేయాల్సింది అంతా చేసి పెట్టారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేంతవరకూ విశ్రమించలేదు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన అయిదేళ్లలో రెడ్లకు ఎలాంటి ప్రాముఖ్యత దక్కలేదు. వారికి కాంగ్రెస్ తరువాత అంతటి రక్షణ హోదా మర్యాద వైసీపీలో దొరుకుతాయని అనుకుంటే అవి పూర్తిగా లేకుండా పోయాయి. రాజకీయంగా రెడ్లు అంత్యంత బలవంతులు ప్రభావవంతులు అయినప్పటికీ వైసీపీ ప్రభుత్వంలో ఏమీ కాకుండా మిగిలిపోయారు.
వైసీపీని ఇంతలా పెంచి పోషించిన రెడ్లకు ఆ పార్టీలో సముచిత స్థానం అయితే దక్కలేదు అన్నది తీవ్ర అసంతృప్తిగా ఉంది. అది కాస్తా దావానలంగా మారి వైసీపీని 2024 ఎన్నికల్లో ఓడించింది. నూటికి నలభై నుంచి యాభై శాతం రెడ్లు కూటమిని మద్దతుగా నిలిచారు అంటేనే వారు వైసీపీ మీద ఎంతగా రగిలిపోయారో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు.
ఇక వైసీపీని ఓడించడం వెనక రెడ్ల ఉద్దేశ్యం కూడా వేరేది కాదు, జగన్ మారుతారు అని అనుకున్నారు. అయితే జగన్ లో ఆ మార్పు అయితే ఎక్కడా కనిపించడం లేదు అని అంటున్నారు. ఆయన ఎందుకు ఓటమి చెందామన్నది ఎక్కడా లోతైన సమీక్ష చేయడం లేదని రెడ్లు గుర్రుగా ఉన్న సంగతిని కూడా పట్టించుకోవడం లేదని భావిస్తున్నారు.
దాంతో పాటుగా ఈవీఎంల వల్లనే ఓటమి లభించింది అని భావిస్తున్నారని చంద్రబాబు హామీలు తీర్చలేరని మళ్లీ వైసీపీనే ఎన్నుకుంటారు అన్న భ్రమలలో జగన్ ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న రెడ్లలో తీవ్ర స్థాయిలో అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.
తమకు తమ రాజకీయానికి రక్షణగా నిలిచే బలమైన రెడ్డి నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు అని అంటున్నారు. అంటే వైఎస్ జగన్ కి ఆల్టరేషన్ గా అన్న మాట. తెలంగాణాలో రేవంత్ రెడ్డి మాదిరిగా ఏపీలో కూడా సరైన లీడర్ దొరికితే వైసీపీ నీడ నుంచి బయటకు వచ్చి పూర్తి స్థాయిలో సపోర్టు చేయాలని రెడ్లు భావిస్తున్నారుట.
ఈ దిశగా వారి ఆలోచనలు సాగుతూండడం వైసీపీకి ప్రమాద ఘంటికలే అని అంటున్నారు. వైసీపీ ఎంత కాదనుకున్న రెడ్ల సపోర్ట్ తోనే నడిచే పార్టీ. ఆ పార్టీకి మూల ధనం అసలైన పెట్టుబడి రెడ్డి సామాజిక వర్గమే. వారి దెబ్బ ఏ స్థాయిలో ఉంటుందో తాజా ఎన్నికలు నిరూపించాయి. రాయలసీమలో అనేక జిల్లాలను ప్రభావితం చేసే రెడ్లు వైసీపీని కసిగా ఓడించారు అని అంటున్నారు.
అయితే కొంతమంది ఓట్లు వేయడం వల్లనే 40 శాతం ఓటు షేర్ వచ్చిందని అంటున్నారు. ఇపుడు జగన్ మారకపోతే రెడ్లు రెడ్ సిగ్నల్ చూపించడం ఖాయమని అంటున్నారు. నాయకులు బోలెడు మంది ఉంటారు. వారు ఎపుడూ జనం నుంచే తయారు అవుతారు. జగన్ కూడా అలాగే వైఎస్సార్ తరువాత వచ్చారు అంటే బలమైన సామాజిక వర్గం కోరుకోబట్టే అని అంటున్నారు.
అలాంటి బలమైన సామాజికవర్గం జగన్ వద్దు అనుకుంటే అది వైసీపీకే భారీ రాజకీయ నష్టాన్ని చేకూరుస్తుందని అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో బలమైన సామాజిక రాజకీయ నేపధ్యం ఉన్న కులాలలో రెడ్లు ఉంటారు. కమ్మలు రెడ్లతో పాటు కాపులు కూడా ఇపుడు ఏపీ రాజకీయాల్లో వాటాకు ముందుకు వస్తున్నారు. అది ట్రయాంగిల్ ఫైట్ గా మారుతోంది. అయితే రెడ్లు తాము ఫోర్ ఫ్రంట్ లో ఉండేలా రాజకీయం చేయాలని అనుకుంటున్నారు.
జగన్ తో అది సాధ్యం కాదని తేలిపోవడంతోనే కొత్త వేట స్టార్ట్ అయింది అని అంటున్నారు. ఈ వేటకు ఫలితం దక్కితే మాత్రం ఏపీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని అతి పెద్ద దెబ్బ వైసీపీకి పడుతుంది అని అంటున్నారు. అటువంటి పరిస్థితి రానీయకుండా నివారించడం అన్నది ఇపుదు వైసీపీ హై కమాండ్ చేతిలోనే ఉంది అని అంటున్నారు.