కీలకంగా మారనున్న రెడ్లు.. వైసీపీ వైపు నిలుస్తారా..?
వచ్చే ఎన్నికల్లో మరోసారి రెడ్డి సామాజిక వర్గం కీలకంగా మారనుందా? రెడ్లు ఈ సారి కూడా తెరవెనుక చక్రం తిప్పనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు.
By: Tupaki Desk | 15 Aug 2023 4:30 PM GMTవచ్చే ఎన్నికల్లో మరోసారి రెడ్డి సామాజిక వర్గం కీలకంగా మారనుందా? రెడ్లు ఈ సారి కూడా తెరవెనుక చక్రం తిప్పనున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల వరకు.. రెడ్డి వర్గంలోనూ ఒకింత అసహనం.. ఒకింత బాధ వ్యక్తమయ్యాయి. తాము చేసిన పనులకు బిల్లులు రావడం లేదని.. గుర్తింపు లేకుండా పోయిందని కొందరు వగచారు. అయితే.. ఎంతో కొంత బిల్లులను ఇటీవల వైసీపీ ప్రభుత్వం విడుదల చేసింది.
దీనికి తోడు వచ్చే ఎన్నికల్లోపు.. పెండింగు బిల్లులను కూడా పూర్తిస్థాయిలో ఇచ్చేందుకు సర్కారు ఏర్పాటు చేస్తున్నట్టు రెడ్డి సామాజికవర్గంలో చర్చగా మారింది. ఇక, రాజకీయంగా ఇటీవల కాలంలో రెడ్డి వర్గం వైసీపీ కి దూరమయ్యే ప్రయత్నం చేసిందనే చర్చ సాగింది. కానీ, వాస్తవానికి.. కొంత గ్యాప్ అయితే వచ్చింది. కానీ, పూర్తిస్థాయిలో రెడ్డి సామాజిక వర్గం వైసీపీకి దూరం కాలేదు.కానీ, ఆ తరహా ప్రచారం అయితే ముమ్మరంగా సాగింది.
మధ్యలో కొన్నాళ్లు ప్రతిపక్షాలు కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకునేందుకు ప్రయత్నించినా.. కొన్నా ళ్లు రెడ్డి వర్గానికి అనుకూలంగా ప్రకటనలు చేసినా.. మధ్యలో ఎందుకో రెడ్డి వర్గం మళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపింది. దీనికి కాపు సామాజిక వర్గం పవన్ వైపు ఉండడం, తమను ఒంటరిని చేసి.. రాజకీయంగా ఇబ్బంది సృష్టించే అవకాశం ఉందని భావించడం వల్లే.. రెడ్డి వర్గం వైసీపీతో కలిసి మళ్లీ ఎన్నికలకు రెడీ అవుతోందనే వాదన వినిపిస్తోంది.
ఇక, రెడ్డి సామాజిక వర్గంలో చోటు చేసుకున్న అసంతృప్తిని తొలగించి.. వైసీపీకి వారిని చేరువ చేసేందుకు.. కీలక నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఇటీవల కాలంలో రహస్యంగా రెడ్డి సామాజిక వర్గంతో ఆత్మీ య భేటీలు నిర్వహించారు. ఫలితంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు వైసీపీ వైపే ఉన్నాయని... ఉంటాయని భావిస్తున్నారు. మరి ఇది ఎన్నికల నాటికి మారుతుందో.. ఈ అంచనా కొనసాగుతుందో లేదో చూడాలి.