Begin typing your search above and press return to search.

విశాఖలో వైసీపీ వెరీ వీక్ గురూ !

ట్రయాంగిల్ ఫైట్ జరిగింది కాబట్టి 2019లో జస్ట్ నాలుగు వేల స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకుంది.

By:  Tupaki Desk   |   8 Aug 2024 12:30 AM GMT
విశాఖలో వైసీపీ వెరీ వీక్ గురూ !
X

వైసీపీ విశాఖలో వెరీ వీక్ అని మరోసారి రుజువు అయ్యింది. విశాఖలో వైసీపీ పార్టీ పుట్టాక ఎపుడూ పరాజయాలను అందుకుంటూ వస్తొంది. దానికి 2019లో ఎంపీ సీటులో విజయం అలాగే 2021లో జీవీఎంసీలో విజయం మినహాయింపు. అయితే ఈ రెండూ దక్కడానికి కారణాలు ఉన్నాయి.

ట్రయాంగిల్ ఫైట్ జరిగింది కాబట్టి 2019లో జస్ట్ నాలుగు వేల స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ విశాఖ ఎంపీ సీటు గెలుచుకుంది. అదే జనసేన తప్పుకుని ఉంటే ఆనాడే టీడీపీ ఎంపీ విశాఖలో గెలిచేవారు అని లెక్కలు చెబుతున్నారు. ఇక 2021లో జీవీఎంసీ గెలిచింది అంటే అధికారంలో వైసీపీ ఉండడమే అసలైన కారణం.

ఇపుడు చూస్తే వైసీపీ అసలు బలం ఏంటో తెలిసిపోయింది అంటున్నారు. వైసీపీకి విశాఖలో మొదటి నుంచి బలమైన నాయకత్వం లేదు. అలాగే పటిష్టమైన వ్యూహాలను అమలుచేసే విధానం లేదు. టీడీపీ విశాఖలో మొదటి నుంచి బలంగా ఉంటూ వచ్చింది. జనసేనకు కూడా విశాఖలో బలం ఉంది. ఇలా రెండు పార్టీల కలయికతో కూటమి స్ట్రాంగ్ గా ఉంది. దానికి తోడు అధికారం చేతిలో ఉంది.

ఈ నేపధ్యంలో స్థాయీ సంఘం ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వైసీపీలో ఉన్న అసంతృప్తి కూడా ఈ విధంగా వ్యక్తం అయింది అని అంటున్నారు. దాదాపుగా అరవై మంది కార్పోరేటర్లు వైసీపీకి ఉన్నా వారిలో సగానికి సగం మంది కూటమి వైపు జారిపోతున్నా పరిరక్షించుకునే విధంగా వైసీపీ వ్యవహరించలేదు అని అంటున్నారు.

దాంతో వెళ్ళిన వారు వెళ్ళిపోయారు. ఉన్న వారిలో కొందరు ఇక్కడ ఉండి అక్కడ ఓటు వేసారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు కార్పోరేటర్ల ని పట్టించుకోలేదని వారిలో అసంతృప్తి తీవ్రంగా ఉంది. అంతే కాదు జీవీఎంసీలో వైసీపీ కార్పోరేటర్లు అధికారంలో తాము ఉన్నా ఏ పని జరగలేదని కొందరు మాత్రమే సర్వాధికారాలు చలాయిస్తూ వచ్చారని వాపోతూ ఉండేవారు. అలాంటి వారు అంతా ఇపుడు సరైన టైం చూసి వైసీపీకి దెబ్బేశారు అని అంటున్నారు.

ఇక వైసీపీ తరఫున గట్టిగా నిలబడి అర్ధబలంతో వారిని ఆకట్టుకునే నాధుడే కనిపించలేదు. దాంతో పాటు అయిదేళ్ళ పాటు టీడీపీ కూటమి ఏపీలో అధికారంలో ఉండే సీన్ కనిపిస్తోంది. దాంతో అధికార పార్టీ వైపు ఉంటే తమ పనులు చివరి రెండేళ్ళలో అయినా సాగుతాయని చాలా మంది భావించి కూటమి వైపుగా సాగారు అని అంటున్నారు.

కూటమిని విజయపధంలో నడిపించడానికి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నుంచి ఎమ్మెల్యేలు అంతా పూర్తి శ్రద్ధ తీసుకున్నారు. అదే వైసీపీలో వ్యూహరచన చేసే వారే లేక ఇలా తేలిపోయింది అని అంటున్నారు. ఇదంతా స్వయంకృతాపరాధం అని అంటున్నారు.