Begin typing your search above and press return to search.

వైసీపీ ఆరవ జాబితాలో భారీ ట్విస్టులు...!

వైసీపీ ఆరవ జాబితా వచ్చేసింది. లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్ ని పట్టుకుని మరీ ఇందులో ఇంచార్జిలను నియమించినట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 Feb 2024 4:21 PM GMT
వైసీపీ ఆరవ జాబితాలో భారీ ట్విస్టులు...!
X

వైసీపీ ఆరవ జాబితా వచ్చేసింది. లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్ ని పట్టుకుని మరీ ఇందులో ఇంచార్జిలను నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ జాబితాలో ఊహించిన పేర్లతో పాటు ఊహించనివి ఉండడమే భారీ ట్విస్టులుగా చెప్పుకుంటున్నారు.

ఇక ఈ జాబితా చూస్తే రాజమండ్రి ఎంపీ నియోజకవర్గానికి ఇంచార్జిగా గూడూరు శ్రీనివాస్ అలాగే అందరికీ ఆసక్తిని రేపే సీటుగా ఉన్న నర్సాపురం ఎంపీ సీటుకు ఇంచార్జిగా గూడూరు ఉమాబాల, గుంటూరు ఎంపీ సీటుకు ఇంచార్జిగా ఉమ్మారెడ్డి రమణ, చిత్తూరు ఎంపీ ఇంచార్జిగా సిట్టింగ్ ఎంపీ రెడ్డప్పను నియమించారు.

అదే విధంగా గిద్దలూరి అసెంబ్లీ సీటుకు ఇంచార్జిగా నాగార్జున రెడ్డి, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్, గంగాధర నెల్లూరుకి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మిగనూరుకి మాజీ ఎంపీ బుట్టా రేణుక, మైలవరం తిరుపతిరావు, మార్కాపురం రాంబాబులను నియమించారు.

ఇందులో చాలా విషయాలే ఉన్నాయి. ముఖ్యంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట క్రిష్ణ ప్రసాద్ కి షాక్ ఇచ్చేశారు. బుట్టా రేణుకకు 2014లో కర్నూల్ ఎంపీగా చాన్స్ ఇచ్చారు. ఇపుడు ఆమెకు పదేళ్ల విరామం తరువాత ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తున్నారు.

అలాగే అంతకు ముందు జాబితాలో చిత్తూరు ఎంపీ రెడ్డప్పకు జీడీ నెల్లూరుకు ఇంచార్జిని చేశారు. నారాయణస్వామిని ఎంపీ సీటుకు మార్చారు. కానీ ఇపుడు మళ్లీ యధాతధంగా చేశారు. అంటే పెద్దాయన నారాయణస్వామికే జగన్ ఓటేశారు అనుకోవాలి.

నెల్లూరు అర్బన్ సీటుని రాజ్య సభ ఎంపీ వేమిరెడ్డి ప్రభారకరెడ్డి సతీమణి ప్రశాంతికి ఇస్తారని అనుకున్నా ముస్లిం మైనారిటీ అయిన ఖలీల్ కి ఇచ్చారు. గుంటూరు ఎంపీ సీటు కాపులకు ఇవ్వాలని ఆలోచించారు. కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి ఫ్యామిలీకి చెందిన వారికే ఇచ్చారు. సో అలా చాలా మార్పు చేర్పులు కనిపిస్తాయి ఇందులో.