వైయస్ఆర్సీపీ సోషల్ మీడియాకు మరో సారధి
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని విధంగా అన్నస్థాయిలో 11 సీట్లకు పరిమితమైంది
By: Tupaki Desk | 13 Aug 2024 11:59 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన వేళ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, సూపర్ సిక్స్ హామీలపై దాట వేత ధోరణి అవలంభిస్తుందని, మన ప్రభుత్వమే ఉండి ఉంటే ఈ పాటికి ప్రజలకు అందాల్సిన పథకాలన్నీ అందేవని జగన్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియా నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై బలమైన యుద్ధమే జరుగుతుంది.
టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు వైసీపీ సోషల్ మీడియా రెగ్యులర్ గా రియాక్ట్ అవుతూ ముందుకు కదులుతుంది. పైగా ఇప్పుడు ఐదేళ్లు పాలించిన తర్వాత ప్రతిపక్షంలో ఉండటంతో.. ఈ సమయంలో సోషల్ మీడియా రెట్టింపు వేగంతో, మరింత పవర్ ఫుల్ గా పని చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో సజ్జల భార్గవ్ కు తోడుగా మరో సారథిని నియమించారు జగన్.
అవును... వైసీపీ సోషల్ మీడియాకు మరో సారథిని నియమించారు జగన్. ఈ మేరకు వైఎస్ విజయమ్మ సోదరుడు సుదర్శన్ రెడ్డి అల్లుడైన యశ్వంత్ రెడ్డిని నియమించారు. ఈ విషయం గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజా ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సమయంలో... సజ్జల భార్గవ్ పర్యవేక్షణలోనే ఈయన పనిచేయనున్నారనీ అంటున్నారు.
ఇదే క్రమంలో... యశ్వంత్ రెడ్డికి అన్ని విధాలా సజ్జల భార్గవ్ గైడ్ చేయనున్నారని తెలుస్తోంది. దీంతో.. వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు డబుల్ వేగంగా పనిచేసే అవకాశం ఉందని.. ప్రజాసమస్యలను డబుల్ బలంగా తెరపైకి తెస్తుందని.. కూటమి నేతల అసత్య ప్రచారాలను డబుల్ వేగంతో పెర్ ఫెక్ట్ గా తిప్పికొడుతుందని ఆ పార్టీ శ్రేణులు ఇంకాస్త బలంగా భావిస్తున్నారు.