Begin typing your search above and press return to search.

లోకేశ్‌ ఫారిన్‌ టూర్‌ రచ్చ రచ్చ!

తాజాగా నారా లోకేశ్‌ ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేసింది. 'హే లోకేశ్‌.. జూలై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్లావు?

By:  Tupaki Desk   |   15 Aug 2024 7:02 AM GMT
లోకేశ్‌ ఫారిన్‌ టూర్‌ రచ్చ రచ్చ!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డా వైసీపీ, టీడీపీ మధ్య వార్‌ నడుస్తోంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో వైసీపీ వర్సెస్‌ నారా లోకేశ్‌ అన్నట్టు పరిస్థితి ఉందని చర్చ జరుగుతోంది. ఒకరి పోస్టులకు మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు.

తాజాగా నారా లోకేశ్‌ ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ సోషల్‌ మీడియాలో ఒక పోస్టు చేసింది. 'హే లోకేశ్‌.. జూలై 30, 31, ఆగస్టు 1, 2, 3, 4, 5 తేదీల్లో నువ్వు దేశం విడిచి ఎక్కడికి వెళ్లావు? ఎవరితో చెప్పకుండా, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఏ దేశం వెళ్లావు? విదేశాల్లో నువ్వు చేసిన నిర్వాకాలేంటి?’ అంటూ వైసీపీ.. నారా లోకేశ్‌ ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగింది. ఈ పోస్టును లోకేశ్‌ ఎక్స్‌ హ్యాండిల్‌ ను ట్యాగ్‌ చేసింది.

వైసీపీ పోస్టుకు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు."ఫేకు జగన్‌.. నాది రెడ్‌ బుక్‌ మాత్రమే కాదు ఓపెన్‌ బుక్‌ కూడా! నీలాగా నాకు క్విడ్‌ ప్రో కో, మనీ లాండరింగ్‌ వ్యవహారాలు, సీబీఐ కేసులు లేవు. విదేశాలకు వెళ్లాలంటే నీ మాదిరిగా కోర్టు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. బాధ్యత గల రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అనుమతితోనే విదేశాలు వెళ్ళాను. జనాలు కొట్టిన స్లిప్పర్‌ షాట్‌ నుండి కోలుకోవడానికి కొంత టైం పడుతుంది... చిల్‌ బ్రో! సరే కానీ బాబాయ్‌ ను లేపేసింది ఎవరో చెప్పే దమ్ముందా జగన్‌?".. అంటూ లోకేశ్‌ తన పోస్టులో ధీటుగా ప్రతిస్పందించారు. అంతేకాకుండా.. ఫేక్‌ జగన్, ఆంధ్రప్రదేశ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగులను కూడా తన పోస్టుకు లోకేశ్‌ జోడించారు. అలాగే తన విదేశీ టూరుకు సంబంధించిన ట్రాన్సిట్‌ పత్రాన్ని కూడా ఆయన పోస్టు చేశారు. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకుని లోకేశ్‌ జర్మనీలో పర్యటించినట్టు ఉంది.

లోకేశ్‌ ప్రతిస్పందనతో తృప్తిపడని వైసీపీ ఆయనను మరోసారి కెలికింది. 'లోకేష్‌ చివరకు నువ్వు నిజం ఒప్పుకోక తప్పలేదు.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి కూడా ప్రజలెవ్వరికీ చెప్పకుండా వారం రోజులు విదేశాలకు చెక్కేశావ్‌..

మేం ప్రశ్నిస్తే కాని నువ్వు బయటపెట్టలేదు. నువ్వు ఓపెన్‌ బుక్‌ అయితే నీ టూర్‌ షెడ్యూల్‌ అధికారికంగా ఎందుకు విడుదల చేయలేదు?..

నీకోసం ఆగస్టు 2న జరగాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని ఎందుకు ఆగస్టు 7కు వాయిదా వేయించావు?..

ఇన్నిరోజులపాటు ఆ టూర్‌ సమాచారాన్ని ఎందుకు దాచావ్‌?..

ఎక్కడకు వెళ్లావో నిర్భయంగా చెప్పొచ్చుగా? ఇక్కడే అర్థం అవుతోంది ఫేక్‌ ఎవరో".. అంటూ వైసీపీ ఎక్స్‌ లో లోకేశ్‌ పై విరుచుకుపడింది.

"అదే వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గారు అన్ని అనుమతులు తీసుకుని తన కుమార్తెలను చూడ్డానికి వెళ్తే నీ మనుషుల ద్వారా నానా యాగీ చేయించావ్‌.

ఫేక్‌ కథనాలు రాయించి ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నించావ్‌..

మరో విషయం ఏంటంటే నీది రెడ్‌ బుక్‌ అంటున్నావ్‌. అంటే రాష్ట్రంలో జరిగిన హత్యలకు, దౌర్జన్యాలకు, దాడులకు బాధ్యుడివి నీవేనని ఒప్పకున్నట్టేగా.?

మేం చెప్పేది కూడా అదే. రాష్ట్రంలో నడుస్తున్నది రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అని..లా అండ్‌ ఆర్డర్‌ లేనేలేదని" అంటూ వైసీపీ.. లోకేశ్‌ పై తీవ్ర విమర్శలు చేసింది.

మొత్తానికి వైసీపీ, లోకేశ్‌ మధ్య జరిగిన ఈ సోషల్‌ మీడియా వార్‌ లో తేలిన విషయం ఏమిటంటే.. నారా లోకేశ్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకునే జర్మనీలో పర్యటించినట్టు వెల్లడైంది. అయితే ఆయన ఇప్పటివరకు అంటే.. వైసీపీ ప్రశ్నించే వరకు తన పర్యటనను రహస్యంగా ఉంచడమెందుకు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వెళ్తుంటే ముందే ఈ విషయాన్ని చెప్పి ఉంటే ఈ గోల అంతా ఉండేది కాదుగా అంటున్నారు.