రింగ్ రోడ్డులో చంద్రబాబు... వ్యూహాత్మకంగా వైసీపీ
అందులో అతి చిన్న కేసులోనే బాబు అరెస్ట్ అయిపోయి జైలుకు వెళ్లారు. దీని కంటే చాలా స్ట్రాంగ్ కేసుగా అమరావతి రింగ్ రోడ్డు కేసు ఇపుడు ముందుకు రాబోతోంది.
By: Tupaki Desk | 12 Sep 2023 5:42 PM GMTఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా రెండు రోజుల పాటు జైలులో ఉన్న తరువాత ముఖ్యమంత్రి జగన్ లండన్ నుంచి విజయవాడ చేరుకున్నారు. పది రోజుల పర్సనల్ టూర్ అనంతరం ఆయన ఏపీకి రావడం జరిగింది. బాబు అరెస్ట్ అన్నది లండన్ లో జగన్ కి తెలిసినా ఇపుడు డైరెక్ట్ గా ఉంటూ ఈ కేసు విషయం లో అన్ని వివరాలను మరోసారి సేకరిస్తున్నారు.
బాబు అరెస్ట్ రిమాండ్ వంటి పరిణామాల మీద అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకరరెడ్డి ముఖ్యమంత్రికి పూర్తిగా వివరించారు. జగన్ రాగానే ఆయన స్వయంగా వెళ్ళి కలసి దీని మీద మొత్తం బ్రీఫింగ్ ఇచ్చినట్లుగా తెలిసింది. రాత్రి ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్యం శ్రీరాం జగన్ని కలసి మాట్లాడారు అని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ ఏసీబీ కోర్టులో విచారణ, హై కోర్టులో పిటిషన్లు వంటి వాటి మీద ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వపరంగా వాదించాల్సిన అంశాలపై ఇరువురు చర్చించారని వార్తలు వస్తున్నాయి.
అంతే కాకుండా బాబు కేసుల మీద దాఖలు అయిన పిటిషన్లపై ప్రభుత్వపరంగా కోర్టుల్లో వాదించాల్సిన అంశాలను అడ్వొకేట్ జనరల్ దృష్టికి సీఎం జగన్ తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతానికి చంద్రబాబు అరెస్టయినది స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాత్రమే. ఈ కేసు మీదనే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
నిజానికి బాబు మీద చాలా కేసులు వరసబెట్టి ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. అందులో అతి చిన్న కేసులోనే బాబు అరెస్ట్ అయిపోయి జైలుకు వెళ్లారు. దీని కంటే చాలా స్ట్రాంగ్ కేసుగా అమరావతి రింగ్ రోడ్డు కేసు ఇపుడు ముందుకు రాబోతోంది.
ఈ కేసులో అనేక ఆధారలతో 2022లోనే ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ కేసులో చంద్రబాబు ఏ వన్ గా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో అయితే బాబు ఎ 37గా ఉన్నారు. కానీ రింగ్ రోడ్ కేసులో ఆయనే ఏ వన్. ఇక ఈ కేసులో చాలా పవర్ ఫుల్ సెక్షన్లు కూడా పెట్టి కేసు విచారణను చేస్తున్నారు. ఒక వేళ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసులో బాబుకు బెయిల్ వస్తే అపుడు రింగ్ రోడు కేసును ముందు పెట్టి మరోసారి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అంటున్నారు.
ఇలా బాబు మీద చాలా కేసులు ఉన్నాయనే అంటున్నారు. మొత్తానికి బాబు గుక్కతిప్పుకోనీయని వ్యూహాలతో వైసీపీ ముందుకు వెళ్లబోతోంది అని అంటున్నారు. నిజానికి రాజకీయ చాణక్యుడు చంద్రబాబు అన్ని కేసుల విషయంలో అలెర్ట్ గానే ఉన్నారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం ఆయన ఏమరుపాటుగానే వ్యవహరించారు అని అంటున్నారు. పెడితే గిడితే నారా లోకేష్ మీద కేసు పెట్టవచ్చు అని ఆయన్ని బెయిల్ మీద తీసుకుని వచ్చి ఈ కేసు విషయంలో తాను జనంలో ఉండి సింపతీ కార్డు తీయవచ్చు అని స్కెచ్ వేశారని అంటున్నారు.
కానీ వ్యూహాత్మకంగా వైసీపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ కేసు ఏకంగా బాబు మెడకే చుట్టేసింది. ఆయన ఊహించేలోగానే కీలక పరిణామాలు అలా చకచకా సాగిపోయాయి. మొత్తానికి చూస్తే బాబు ఇపుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. వన్స్ జైలులో ఉన్న చంద్రబాబు మీద మిగిలిన కేసులతో బిగించడం ద్వారా అటు నుంచి నరుక్కు రావాలన్నది వైసీపీ ప్లాన్ అంటున్నారు. మరిపుడు టీడీపీ ఎలా వీటిని చేదిస్తుందో చూడాల్సి ఉంది అంటున్నారు.