వైసీపీ టోటల్ లిస్ట్ సంక్రాంతి తరువాత...!?
ఏపీలో మార్చిలో ఎన్నికలు జరుగుతాయని బలమైన సంకేతాలు వెలువడుతూండడంతో గట్టిగా వంద రోజులు కూడా సమయం లేదు.
By: Tupaki Desk | 21 Dec 2023 1:30 PM GMTఏపీలో అధికార వైసీపీ జోరుగా ఉంది. అభ్యర్ధుల ఎంపికను ఆ పార్టీ మొదలెట్టేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ విషయంలో చాలా మంది కంటే ముందున్నారు. ఏపీలో మార్చిలో ఎన్నికలు జరుగుతాయని బలమైన సంకేతాలు వెలువడుతూండడంతో గట్టిగా వంద రోజులు కూడా సమయం లేదు. దాంతో అభ్యర్థులను ఎంపిక చేసి ఎంత వీలు అయితే అంత తొందరగా ప్రకటిస్తే ఎన్నికల వేళకు వారు ఫోర్ ఫ్రంట్ లోకి వస్తారని జగన్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది అంటున్నారు.
అదే విధంగా అసంతృప్తులు అలకలు ఏవైనా ఉంటే ఈలోగా సర్దుబాటు చేసుకోవచ్చు అని కూడా జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఈ నెలాఖరులోగా దాదాపుగా మెజారిటీ సీట్ల విషయంలో ఒక అంచనా వస్తుందని అంటున్నారు. మిగిలిన వాటిని కూడా పూర్తి చేసుకుని కొత్త ఏడాది సంక్రాంతి పండుగ తరువాత మొత్తం 175 అభ్యర్ధుల జాబితాను ఒకేసారి రిలీజ్ చేయాలని జగన్ భావిస్తున్నారు అని అంటున్నారు.
ఒక్కసారి లిస్ట్ రిలీజ్ చేస్తే ఇక ఎమ్మెల్యే అభ్యర్ధులు జనంలో ఉంటారని అది ఎన్నికల్లో భారీ విజయానికి ఉపకరిస్తుందని జగన్ ప్లాన్ అంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపికలో అనేక సర్వేలను కూడా జగన్ పరిగణనలోకి తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఐప్యాక్ టీం సర్వేతో పాటు తాను సొంతంగా చేయించుకున్న సర్వేలు ఇంటలిజెన్స్ నివేదికలు ఇలా అనేక అధ్యయనాలతో కూడిన నివేదికలను ముందుంచుకుని ఎంపిక కార్యక్రమం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు.
అదే విధంగా ఈసారి ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వని వారిని వేరే చోటకు మారుస్తున్నారు అని అంటున్నారు. అలాగే కొందరికి ఎంపీ చాన్స్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరికొందరికి ప్రభుత్వం వచ్చాక అవకాశాలు ఇస్తామని హామీలు ఇస్తున్నారు. వీటి విషయంలో దేనికీ ఓకే చెప్పని వారు ఉంటే కనుక పార్టీ ఇక వారి ఇష్టానికే వదిలిపెట్టే చాన్స్ ఉందని అంటున్నారు.
అంటే ఏ ఒక్కరినీ తాను వదులుకోనని జగన్ ఇప్పటికే అనేక వర్క్ షాప్స్ లో స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అంతా గెలిచి రావాలని తాను కోరుకుంటున్నట్టు జగన్ అంటున్నారు. అదే సమయంలో అందరి కంటే పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ విజయం కోసం వైసీపీ అధినాయకత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది అని అంటున్నారు. ఇక ప్రతీ ఒక్కరూ తనను నమ్మితే తాను పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేస్తాను అని జగన్ చెబుతూనే వస్తున్నారు.
అయితే ఎవరి ఆలోచనల మేరకు వారు ఉంటారు కాబట్టి వైసీపీలో టికెట్లు దక్కని వారు ఏమి చేస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. అదే విధంగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కూడా టీడీపీ జాగ్రత్తగా గమనిస్తోంది అని అంటున్నారు. ఏది ఏమీనా కూడా ఏపీలో ఈసారి ఎన్నికల్లో జగన్ కొత్త ముఖాలతో ఫ్రెష్ నెస్ తో వెళ్లాలని అనుకుంటున్నారు అని అంటున్నారు. అదే విధంగా నోటిఫికేషన్ కి నెల రోజుల ముందుగానే అభ్యర్ధులను ప్రకటించి జనంలోకి పంపాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ ప్రయోగాలు నూరు శాతం సక్సెస్ అవుతాయని అని ఆయన భావిస్తున్నారు.