Begin typing your search above and press return to search.

వైసీపీ వెరీ లక్కీ : ఒకే టెర్మ్ లో పదకొండు మంది ఎంపీలు...!

దానికి 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు టీడీపీకి కోల్పోవడం ఒక మినహాయింపు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 12:30 AM GMT
వైసీపీ వెరీ లక్కీ : ఒకే టెర్మ్ లో పదకొండు మంది ఎంపీలు...!
X

వైసీపీ లక్కుని తొక్కి 2019లో అధికారంలోకి వచ్చింది. వచ్చింది కూడా భయంకరమైన మెజారిటీతో 151 సీట్లు అంటే మాటలు కాదు. దానికి తోడు మరో అయిదురుగు విపక్షాల నుంచి వచ్చి చేరారు. అలా 155 మంది ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీలతో పాటు రాజ్యసభ ఎంపీలు కూడా మొత్తం వైసీపీ ఖాతాలోనే పడుతూ వచ్చాయి. దానికి 2023లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు టీడీపీకి కోల్పోవడం ఒక మినహాయింపు.

ఇదిలా ఉంటే వైసీపీ వచ్చిన సమయం కూడా అలా కలసి వచ్చింది. టీడీపీ 2014లో అధికారంలోకి వస్తే ఆ పార్టీ ఉన్న టైం లో రెండు సార్లు మాత్రమే రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. నిజానికి ప్రతీ రెండేళ్ళకు ఒకసారి రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతాయి. అలా చూస్తే కనుక 2014లో మార్చిలో రాజ్యసభ ఎన్నికలు ఉమ్మడి ఏపీలోనే జరిగిపోయాయి. అపుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. టీడీపీ ప్రతిపక్షంలో ఉంది.

టీడీపీ విభజన ఏపీలో పవర్ లో ఉండగా 2016, 2018లలో రెండుసార్లు ఎన్నికలు జరిగితే తడవకు నాలుగేసి మంది వంతున సభ్యులు రిటైర్ అయ్యేవారు. అందులో సంఖ్యాబలం ప్రకారం ఒక సీటు వైసీపీ గెలుచుకునేది. అలా మూడేసి వంతున టీడీపీ ఆరుగురుని మాత్రమే తన పదవీకాలంలో పంపగలిగింది. కానీ వైసీపీ మాత్రం ఏకంగా పదకొండు మందిని పంపించుకోగలిగింది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక 2020 జూన్ లో తొలిసారి రాజ్యసభ ఎన్నికలు జరిగితే ఏకంగా నలుగురు ఎంపీలనూ తన ఖాతాలో పంపించుకోగలిగింది. అలా ఆళ్ల అయోధ్యా రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వానీ రాజ్యసభ ఎంపీలు అయ్యారు.

ఇక 2022 జూన్ లో జరిగిన మరో విడత ఎన్నికల్లో వి విజయసాయిరెడ్డి, ఆర్ క్రిష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు వైసీపీ నుంచి నెగ్గి మొత్తం సీట్లు కైవశం చేసుకుంది ఆ పార్టీ. ఇపుడు చూస్తే మరో మూడు సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ మూడింటికీ వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి సొంతం చేసుకోబోతున్నారు. ఇలా చూస్తే కనుక మొత్తం అయిదేళ్ల వైసీపీ టెర్మ్ లో 11 మంది రాజ్యసభ సీట్లను మొత్తం గెలుచుకుని టీడీపీని జీరో చేసి పారేసింది.

ఈ రకంగా ఎక్కడా జరగదు. కానీ వైసీపీకి వచ్చిన భారీ మెజారిటీ వల్లనే ఇది సాధ్యమైంది. దానితో పాటు అయిదేళ్ల వైసీపీ టెర్మ్ లో మూడు సార్లు రాజ్యసభ ఎన్నికలు జరగడం కూడా ఆ పార్టీకి బాగా లాభించించి. ఇది కూడా ప్రతీ పదేళ్లకు కానీ జరగదు. 2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఉన్నపుడు అది జరిగింది. అపుడు ఆ పార్టీ లబ్ది పొందినా ఇంతలా పూర్తి స్థాయిలో సీట్లు దక్కలేదు. ఎందుకంటే 90కి పైగా సీట్లతో టీడీపీ ఇద్దరు ఎంపీలను గెలిపించుకుంది. 2019లో మాత్రం టీడీపీకి 23 సీట్లు రావడంతో ఏ విధంగానూ చాన్స్ లేకుండా పోయింది.