మాజీ సీఎం అరెస్టు.. ఏ క్షణంలో అయినా!
దీంతో గత వారమే తనకు బెయిల్ కావాలంటూ.. యడియూరప్ప.. బెంగళూరు స్పెషల్ కోర్టును ఆశ్రయిం చారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని రాజకీయ ప్రేరేపితమేనని చెప్పారు.
By: Tupaki Desk | 13 Jun 2024 5:39 PM GMTతప్పు తప్పే.. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నా.. రాష్ట్రంలో తనకు అనుకూల నాయకులు ఉన్నా.. తప్పు చేసిన వారిని చట్టం వెంటాడుతూనే ఉంటుందని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. 17 ఏళ్ల బాలికపై ఆమె తల్ల సమక్షంలోనే భయ భ్రాంతులకు గురి చేసి లైంగిక దాడికి యత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత, సీనియర్ మోస్ట్ రాజకీయ చాణిక్యుడు.. బీఎస్ యడియూరప్ప.
గత మూడు మాసాల కిందట తీవ్ర నేరాలకు సంబంధించిన 'పోక్సో' కేసు నమోదైంది. అయితే.. అప్పట్లో రాష్ట్రంలో ఎన్నికలు రావడంతో విచారణ పుంజుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి.. ఫలితం కూడా వచ్చేసిన దరిమిలా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును దూకుడుగా ముందుకు తీసుకువెళ్తోంది. త్వరలోనే స్తానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేసుకున్న కాంగ్రెస్.. యడియూరప్పపై నిశితంగా దృష్టి పెట్టింది. అయితే.. ఎ క్కడా చట్ట ఉల్లంఘనలకు మాత్రం పాల్పడలేదు.
దీంతో గత వారమే తనకు బెయిల్ కావాలంటూ.. యడియూరప్ప.. బెంగళూరు స్పెషల్ కోర్టును ఆశ్రయిం చారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని రాజకీయ ప్రేరేపితమేనని చెప్పారు. అయినప్పటికీ కోర్టు ఆయనను క్షమించలేదు. తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో దర్యాఫ్తు అధికారులు మాజీ సీఎం యడియూరప్పను ఏక్షణంలో అయినా అరెస్టు చేసేందుకు అవకాశం ఏర్పడిం ది. వాస్తవానికి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. యడియూరప్పకు ఇప్పటి వరకు ఊరట లభించకపోవడం గమనార్హం.