Begin typing your search above and press return to search.

షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న యోగి సర్కారు.. ఆహ్వానం ఉంటేనే ఎంట్రీ

ఈ ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రమే అయోధ్యకు రావాలని యోగి సర్కార్ స్పష్టం చేస్తోంది. తాజాగా నిర్వహించిన రివ్యూలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2023 3:54 AM GMT
షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్న యోగి సర్కారు.. ఆహ్వానం ఉంటేనే ఎంట్రీ
X

ఏళ్లకు ఏళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామాలయ నిర్మాణం పూర్తి చేసుకోవటమే కాదు.. జనవరి 22న దాన్ని ఘనంగా ప్రారంభించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటి వేళ.. ఈ అరుదైన ఘట్టాన్ని కళ్లారా చూసేందుకు అయోధ్యకు వెళ్లేందుకు భారీ ఎత్తున ప్లానింగ్ జరుగుతోంది. అయితే.. ఇందుకు భిన్నంగా తాజాగా యోగి సర్కార్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. అయోధ్య రామాలయంలో రామ్ లల్లాకు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆహ్వానాల్ని పంపుతోంది.

ఈ ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రమే అయోధ్యకు రావాలని యోగి సర్కార్ స్పష్టం చేస్తోంది. తాజాగా నిర్వహించిన రివ్యూలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. లక్షలాది మంది అయోధ్యను పోటెత్తేలా పరిస్థితులు ఉన్నందున.. అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నారు. అందుకే.. ఈ రద్దీని నివారించేందుకు ఉన్న అన్ని మార్గాల్ని మూసేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు.

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు.. దేశ వ్యాప్తంగా లక్షలాదిగా రామభక్తులు తరలి వస్తునన వేళ.. కేవలం ట్రస్టు నుంచి ఆహ్వానాలు అందుకున్న వారు మాత్రం అయోధ్యకు జనవరి 22న రావాలని స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాడ్జిల్లో..రూంలను బుక్ చేసుకున్న వారి బుకింగ్ లను క్యాన్సిల్ చేయాలని ఆదేశించింది. ఆహ్వానాలు అందుకోని వారికి అయోధ్యలోకి అనుమతి ఉండదని యోగి సర్కారు తాజాగా స్పష్టం చేసింది.

అంతేకాదు.. ఆహ్వాన పత్రికలు లేకుండా అయోధ్యలో చేసుకున్న ముందస్తు బుకింగ్ లను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. అయోధ్య రామ మందిర ట్రస్టు ఆహ్వానించిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచన చేశారు. భారీగా భక్తులు అయోధ్యకు పోటెత్తితే.. వారందరికి ఏర్పాట్లు చేయటం తలకు మించిన భారం అవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. కాస్తంత ముందుగానే మేల్కొన్న యోగి సర్కారు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేస్తుందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.