Begin typing your search above and press return to search.

లోకేష్ టీం వెరీ స్ట్రాంగ్

లోకేష్ టీడీపీకి భావి వారసుడు ఆయనను ఫ్యూచర్ సీఎం గా అపుడే తమ్ముళ్లు డిసైడ్ అయి దగ్గర అవుతున్న నేపథ్యం ఉంది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 7:30 AM GMT
లోకేష్ టీం వెరీ స్ట్రాంగ్
X

లోకేష్ టీడీపీకి భావి వారసుడు. ఆయనను ఫ్యూచర్ సీఎం గా అపుడే తమ్ముళ్లు డిసైడ్ అయి దగ్గర అవుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంలోనూ లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన తనకు ఇచ్చిన శాఖలను కూడా ఆకళింపు చేసుకుంటూ మెరుగైన పనితీరుని చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే లోకేష్ టీం అంటూ మంత్రి వర్గంలో ఉందని టాక్ నడుస్తోంది. ఈసారి గెలిచిన ఎమ్మ్మెల్యేలలో యువతరం అంతా లోకేష్ బాబు వెంటే అన్న భావన ఉంది. అలాగే మొత్తం ఇరవై మంది దాకా టీడీపీకి చెందిన మంత్రులు ఉంటే అందులో మెజారిటీ అంతా లోకేష్ టీం గానే చెబుతున్నారు

ఉత్తరాంధ్రాలో చూసుకుంటే యువతరం మంత్రులను కొత్త వారిని ఏరి కోరి చంద్రబాబు తీసుకోవడం వెనక లోకేష్ మాట వ్యూహం కూడా ఉన్నాయని అంటున్నారు. అందుకే చాలా మందికి మొదటిసారి గెలిచినా మంత్రి పదవులు దక్కాయి అని అంటున్నారు.

ఇక రానున్న ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ల కోసం లోకేష్ టీం లో చేరిన వారు చేరాలనుకుంటున్న వారు ట్రై చేస్తున్నారు. స్పీకర్ గా ఉన్న అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ పాత్రుడు లోకేష్ టీం లో చాలా కాలంగా ఉన్నారు. ఆయన పార్టీ విపక్షంలో ఉన్నప్పటి నుంచే లోకేష్ తో సన్నిహితంగా ఉంటూ ఆయన గైడెన్స్ లో పనిచేస్తూ వచ్చారు.

ఇపుడు మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుడిని రాజకీయ వారసుడిగా చూసుకోవాలని అనుకుంటున్నారు అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక భీమిలీ నుంచి వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికే పోటీ చేయించాలని గంటా ప్లాన్ గా వేసుకున్నారని అంటున్నారు

ఆయన ఇటీవల మంగళగిరి వెళ్లి మరీ లోకేష్ ని కలసి వచ్చారు. ఆయన విశాఖకు పరిశ్రమలు తీసుకుని వస్తున్నారు అని కితాబు కూడా ఇచ్చారు. లోకేష్ తో గంటా ఈ రకంగా కొత్త బంధం పెనవేసుకోవడం అంతా తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకునే అని అంటున్నారు.

లోకేష్ టీం లో ఉంటే కచ్చితంగా టికెట్లు వస్తాయి ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని భావించే వారు అంతా చినబాబుతో భేటీలు వేస్తున్నారు. అంటే తండ్రులు సీనియర్ నేతలు చినబాబుకు దగ్గర అవుతూ కుమారుల రాజకీయాన్ని అలా తీర్చిదిద్దుతున్నారని అనుకోవాల్సి ఉంది.

విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే విజయనగరంలో కూడా కొందరు సీనియర్ నేతలు అలాగే ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళంలో కళా వెంకటరావు కుమారుడు కూడా రాజకీయ అరంగేట్రం కోసం చూస్తున్నారు. వీరంతా లోకేష్ టీం లో చేరాలని తహతహలాడుతున్నారు అని అంటున్నారు. అయితే చినబాబు తన టీం ని తానే ఎంపిక చేసుకుంటున్నారు. ఆయన ఎవరిని దగ్గర తీస్తే వారికే ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. అలా ఉత్తరాంధ్రాలో లోకేష్ టీం లో ఉండె లక్కీ లీడర్స్ ఎవరు అన్నదే చర్చగా ఉంది.