పాతికేళ్లకే ప్రత్యర్ధులను పడగొట్టారు !
వాళ్ల వయసు పాతికేళ్లు. అయితేనేం లోక్ సభ ఎన్నికల్లో తమ ప్రత్యర్ధులను మట్టికరిపించి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.
By: Tupaki Desk | 6 Jun 2024 7:05 AM GMTవాళ్ల వయసు పాతికేళ్లు. అయితేనేం లోక్ సభ ఎన్నికల్లో తమ ప్రత్యర్ధులను మట్టికరిపించి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ లోని భరత్ పూర్ నుండి సంజనా జాతవ్, బీహార్ లోని సమస్తిపూర్ నుండి శాంభవి, ఉత్తరప్రదేశ్ లోని కౌశాంబి నుండి పుష్పేంద్ర సరోజ్, మచలీషెహర్ నుండి ప్రియా సరోజ్ లు ఎంపీలుగా పాతికేళ్ల వయసులోనే పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున సంజనా జాతవ్ బీజేపీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై 51,983 ఓట్లతో విజయం సాధించింది. మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాతవ్ పోలీస్ కానిస్టేబుల్ కప్తాన్ సింగ్ సతీమణి. వీరికి ఇద్దరు పిల్లలు. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో జాతవ్ 409 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ ఖేడి చేతిలో జాతవ్ ఓటమి పాలయింది.
బీహార్ లోని సమస్తిపూర్ నియోజకవర్గం నుండి లోక్ జనశక్తి పార్టీ (LJP) నాయకురాలు శాంభవి చౌదరి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సన్నీ హజారీని 187251 ఓట్ల తేడాతో ఓడించింది. ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంభి నుండి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి పుష్పేంద్ర సరోజ్ బీజేపీ అభ్యర్థి వినోద్ కుమార్ సోంకారిపై 103944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. మచలీషహార్ లోక్ సభ స్థానం నుండి ఎస్పీ అభ్యర్థి ప్రియా సరోజ్ బీజేపీ అభ్యర్థి బోలానాథ్ పై 35850 ఓట్లతో విజయం సాధించింది.