Begin typing your search above and press return to search.

దుబాయికి జూనియర్.. బాబు విషయంలో సైలెంట్!

కానీ అది కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ లో జూనియర్ ఫుల్ బిజీగా ఉన్నారు

By:  Tupaki Desk   |   14 Sep 2023 10:19 AM GMT
దుబాయికి జూనియర్.. బాబు విషయంలో సైలెంట్!
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తన జీవిత కాలంలో ఎన్నడూ ఎదుర్కోని కష్టాల్లో ఉన్నారు. ఆయన కలలో సైతం ఊహించని విధంగా జైలు గోడల మధ్యన గడుపుతున్నారు. ఆయన అరెస్ట్, రిమాండ్ మీద ఎన్టీఆర్ కుటుంబం అంతా రియాక్ట్ అయింది కానీ టాలీవుడ్ లో ప్రముఖ నటుడు, గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఎక్కడా రియాక్ట్ కాలేదు.

తమ మేనమామ అరెస్ట్ మీద జైలు జీవితం మీద కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు. దేవర సినిమా షూటింగులోనే జూనియర్ గడుపుతున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ సడెన్ గా దుబాయ్ పర్యటనకు బయల్దేరారు. ఆయన ఎయిర్ పోర్టులో తన ఫ్యామిలీతో కనిపించేసరికి ఆ పిక్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్తున్నారు అంటే ఆయన నటించిన ట్రిపుల్ ఆర్ మూవీకి సంబంధించి సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమాలో ఉత్త్తమ నటుడిగా ఎంపిక ఎంపిక చేసింది. ఆ అవార్డు అందుకోవడం కోసం జూనియర్ దుబాయ్ సడెన్ గా బయల్దేరి వెళ్లారని అంటున్నారు. నిజానికి జూనియర్ విహార యాత్రకు వెళ్తున్నారు అని అంతా అనుకున్నారు.

కానీ అది కాదని తేలిపోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్ లో జూనియర్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ షూటింగ్ కి ఆయన గ్యాప్ ఇచ్చి దుబాయ్ లో జరిగే సైమా అవార్డుల వేడుకకు అటెండ్ అవుతున్నారు అన్న మాట. ఇక జూనియర్ గురించి చూస్తే ఆయన పూర్తిగా నటన మీదన ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

ఆయన తన సినీ కెరీర్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ ఆర్ తో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. ఆయన పాలిటిక్స్ కి గత పుష్కర కాలంగా దూరంగా ఉన్నారని తెలిసిందే. టీడీపీతో ఆయన అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.

ఇక చంద్రబాబు సొంత మేనమామ అయినప్పటికీ ఆయన టీడీపీ ఎన్నికల ప్రచారానికి సైతం హాజరు కలేదు. ఆయన మొదటిసారి చివరి సారి ఎన్నికల ప్రచారం చేసింది 2009 ఎన్నికలలోనే. ఆ తరువాత ఆయన నో పాలిటిక్స్ అనేశారు. ఇక 2014లో టీడీపీ మంచి ఊపు మీద గెలిచింది. కానీ 2019లో ఆ పార్టీకి సాయం అవసరం అయినా జూనియర్ చేయలేదు అంటారు.

ఇక 2024 ఎన్నికలు డూ ఆర్ డై గా ఉన్నాయి. ఇంతటి కీలకమైన సమయంలో జూనియర్ టీడీపీ వైపు ఉంటారా ప్రచారం చేస్తారా అన్న చర్చలు అయితే ఇప్పటిదాకా నడిచాయి. కరెక్ట్ గా ఎన్నికల వేళకు జూనియర్ వచ్చి ప్రచారం చేస్తారని కూడా అంతా అనుకుంటున్న నేపధ్యంలో చంద్రబాబు అరెస్ట్ రిమాండ్ ఇవన్నీ కూడా జూనియర్ కి టెస్ట్ పెట్టినట్లుగా మారాయి.

ఇప్పటిదాకా అయితే జూనియర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. తన పనేంటో తన సినిమాలు ఏంటో అన్నట్లుగా ఆయన ఉన్నారు. మరి ఆయన అంతర్జాతీయ వేదిక మీద అయినా ఇదే విషయం మీద రియాక్ట్ అవుతారా అన్నదైతే మిగిలింది. ఎందుకంటే సైమా అవార్డు అందుకున్న తరువాత ఎటూ మీడియా ఆయన్ని కలుస్తుంది.

ఈ సందర్భంగా బాబు అరెస్ట్, రిమాండ్ మీద ప్రశ్న కచ్చితంగా వేయవచ్చు. మరి జూనియర్ అపుడైనా మౌనం వీడుతారా లేక నో పాలిటిక్స్ అని చెబుతారా అన్నది చూడాలి. ఏది ఏమైనా జూనియర్ మాత్రం సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు కాబట్టి ఆయనది తప్పు అని ఎవరూ అనలేరని అంటున్నారు. మొత్తానికి మామ చంద్రబాబు జైలు జీవితం గడుపుతూటే అల్లుడు జూనియర్ మాత్రం దుబాయ్ టూర్ లో ఉండడం పట్ల టీడీపీ శ్రేణులలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది.