Begin typing your search above and press return to search.

రైలు పట్టాలు తీసే స్థాయికి వైరల్ పిచ్చి... రూ.2 కోట్ల నష్టం!

ఈ క్రమంలో... వారు చేసే కొన్ని విచిత్రమైన పనుల వల్ల కొన్ని సార్లు వారి ప్రాణాలమీదకు కూడా వచ్చి పడుతుంటుంది.

By:  Tupaki Desk   |   26 July 2024 8:02 AM GMT
రైలు పట్టాలు  తీసే స్థాయికి వైరల్  పిచ్చి... రూ.2 కోట్ల  నష్టం!
X

సోషల్ మీడియాలో తమ వీడియోలు వైరల్ కావాలని, తాము రాత్రికి రాత్రి స్టార్లు అయిపోవాలని చాలా యువతి చేసే పిచ్చి చేష్టలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పిచ్చి ముదిరి, ఇంగితం మరిచేలా చేసిందో ఏమొ కానీ... తాజాగా ఓ కుర్రాడు సోషల్ మీడియాలో తన వీడియో కోసం ఏకంగా రైలునే పట్టాలు తప్పించాడు.

అవును... ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తమ వీడియోలు వైరల్ అవ్వాలనే పిచ్చితో కొంతమంది యువత కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... వారు చేసే కొన్ని విచిత్రమైన పనుల వల్ల కొన్ని సార్లు వారి ప్రాణాలమీదకు కూడా వచ్చి పడుతుంటుంది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ కుర్రాడు చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవ్వడమే కాకుండా.. కోట్ల నష్టాన్ని మిగిల్చింది!

వివరాల్లోకి వెళ్తే... నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంట్ లోని ఓ కుర్రాడు (17)కి యూట్యూబ్ లో వీడియోలో చేయాలని కోరిక పుట్టింది. పైగా వీలైనంత తొందర్లోనే తన వీడియోలు వైరల్ అయిపోవాలని, తన ఛానల్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోవాలనే కోరిక పుట్టింది. ఇంకేముంది... అనుకునందే తడవుగా ఓ భయంకరమైన ఆలోచన తన మస్థిష్కంలో పుట్టింది.. వెంటనే కెమెరా వేసుకుని బయలుదేరాడు!

ఇందులో భాగంగా... మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైలు మార్గాలను నిర్దేశించే స్విచ్ ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. అనంతరం తన కెమెరా ట్రైపాడ్ అమర్చుకుని కాస్త దూరంలో కూర్చున్నాడు. ఇంతలో బీ.ఎన్.ఎస్.ఎఫ్. సంస్థకు చెందిన రెండు లోకో మోటివ్ లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ లు ఏం జరిగిందో గుర్తించే సమయానికే అవి పట్టాలు తప్పాయి.

ఈ నేపథ్యలో అక్కడకు సమీపంలోనే ఉన్న ఆ కుర్రాడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం సమాచారం ఇచ్చాడు. దీంతో.. అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో... పట్టాలకు సంబంధించిన కీలక స్విచ్ లను మార్చినట్లు గుర్తించారు. ఇదే సమయంలో తమకు ఫోన్ చేసి సమాచారం అందించిన సదరు కుర్రాడినీ విచారించారు.

అయితే... తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించానే తప్ప.. స్విచ్ ల మార్పులతో తనకు ఏమీ సంబంధం లేదని బుకాయించాడు. ఈ సమయంలో... సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. బాలుడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో... అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ప్రమాదం కారణంగా... రైల్వేకు సుమారు 3,50,000 డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) నష్టం వాటిల్లిందని తెలిపారు!