Begin typing your search above and press return to search.

కాలేజీల్లో ఇప్పుడిదే ప్రమాదకర ట్రెండ్‌!

హానికర పదార్థాలు, రసాయనాలతో తయారుచేసిన పానీయాలకు అమెరికా యువత అలవాటుపడుతోంది.

By:  Tupaki Desk   |   22 May 2024 1:30 AM GMT
కాలేజీల్లో ఇప్పుడిదే ప్రమాదకర ట్రెండ్‌!
X

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా డ్రగ్స్‌ గురించే వినిపిస్తోంది. ఇది కేవలం మనకు మాత్రమే కాదు అమెరికా వరకు విస్తరించింది. ఇప్పుడు అమెరికాలోని కాలేజీ క్యాంపస్‌ ల్లో ప్రమాదకరమైన వ్యసనం కొనసాగుతోంది. హానికర పదార్థాలు, రసాయనాలతో తయారుచేసిన పానీయాలకు అమెరికా యువత అలవాటుపడుతోంది. ఈ పానీయం వారిని మత్తులో ముంచి లేపుతోందని చెబుతున్నారు. ఈ తాగుడు వ్యసనాన్నే బోర్గ్‌ డ్రింకింగ్‌ అని అంటున్నారు.

కాలేజీ యువత ఈ వ్యసనంలో మునిగి తేలుతుండటంతో వారి ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. గ్యాలన్‌ (సుమారు 3.78 లీటర్లు) సైజు ప్లాస్టిక్‌ పాత్రలో వివిధ మిశ్రమాలను కలిపి చేసిన పానీయాన్ని బోర్గ్‌ అంటున్నారు. ఇందులో ఆల్కహాల్‌ అధిక మోతాదులో ఉండే వోడ్కా ప్రధానంగా ఉంటుందని చెబుతున్నారు.

ఒక గ్యాలన్‌ వాటర్‌ బాటిల్‌ లో సగం నీటిని పారబోసి 750 మిల్లీలీటర్ల వోడ్కాను బాటిల్‌ లో నింపుతారు. అయితే ఆల్కహాల్‌ రుచి తెలియకుండా దానికి కొన్ని ఫ్లేవర్స్‌ ను కలుపుతారు. అదేవిధంగా హ్యాంగోవర్‌ ఉండకుండా కొన్ని ఎలక్ట్రోలైట్‌ పౌడర్లనూ కూడా కలుపుతారు. ఇలా అన్ని రకాల మిశ్రమాలతో ఆ పానీయానికి తియ్యటి రుచి వస్తోంది. ఆల్కహాల్‌ వాసన, రుచి తెలియకుండా తియ్యటి పానీయంలా తయారుచేస్తుండటంతో ఎక్కువ మంది ఈ డ్రింక్‌ ను తాగటానికి ఇష్టపడుతున్నారు. దీంతో తమకు తెలియకుండానే దానికి అలవాటుపడి వ్యసనసరులుగా మారుతున్నారు.

అయితే ఆ పానీయాన్ని సేవించినవారు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. కొందరిలో వాంతులు, మూర్చ వంటి లక్షణాలు ఉంటున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో తీవ్ర హైడ్రేషన్‌ కూడా సంభవిస్తుంది. ఇది దీర్ఘకాలంలో గుండె, మెదడు సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదముందని అంటున్నారు.

బోర్గ్‌ డ్రింక్‌ పాపులర్‌ కావడానికి సోషల్‌ మీడియానే ప్రధాన కారణమనే సంగతి మీకు తెలుసా?! బోర్గ్‌ డ్రింకింగ్‌ తయారీపై అనేక మీడియాలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆల్కహాల్‌ ప్రభావం లేని కొత్త పానీయం అంటూ కొందరు దీన్ని ట్రెండ్‌ చేశారు. దీంతో యువత దీనికి పెద్ద ఎత్తున అడిక్ట్‌ అయ్యారు.

సరిగ్గా రెండేళ్ల క్రితం 2022లో బోర్గ్‌ డ్రింకింగ్‌ మొదలయింది. ఇక అక్కడి నుంచి నిదానంగా అమెరికా మొత్తం వ్యాపించింది. బోర్గ్‌ డ్రింకింగ్‌ పట్ల అక్కడి ఆందోళన వ్యక్తమవుతోంది. యువత పెద్ద ఎత్తున దీనికి వ్యసనపరులుగా మారడంతో స్థానిక ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోర్గ్‌ డ్రింకింగ్‌ బారినపడకుండా కాలేజీల్లో అవగాహన సదస్సులు ప్రారంభించాయి. బోర్గ్‌ డ్రింకింగ్‌ పై తీవ్ర దుష్పరిణామాల గురించి వివరిస్తున్నారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్‌ ఇస్తున్నాయి.