Begin typing your search above and press return to search.

జెన్ జీ డ్రీమ్ జాబ్.. డ్రీమ్ గానే మిగిలిపోతుందా?

అవును... సాధారణంగా ఎయిటీస్ లో ఎక్కువగా పిల్లలను నువ్వు పెద్దాయక ఏమవుతావంటే డాక్టర్, ఇంజినీర్ అని చెప్పేవారు.

By:  Tupaki Desk   |   19 Aug 2024 10:42 AM GMT
జెన్  జీ డ్రీమ్  జాబ్.. డ్రీమ్  గానే మిగిలిపోతుందా?
X

సాధారణంగా యువతకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవ్వాలని.. మంచి కార్పొరేట్ కంపెనీలో ఐదంకెల జీతంలో మంచిగా సెటిల్ అవ్వాలని.. జాబ్ చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కలలు ఉంటాయి. అయితే ప్రస్తుతం మారుతున్న ప్రపంచంలో ప్రధానంగా "జెన్ జీ" (1997 - 2005 మధ్య జన్మించిన వారు)కి ఓ సరికొత్త సమస్య మరింత ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అదే... డ్రీం జాబ్!

అవును... సాధారణంగా ఎయిటీస్ లో ఎక్కువగా పిల్లలను నువ్వు పెద్దాయక ఏమవుతావంటే డాక్టర్, ఇంజినీర్ అని చెప్పేవారు. అలాంటి డ్రీమ్స్ జెన్ జీ యువతకూ ఉన్నప్పటికీ టెక్ ప్రపంచానికి ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. సరైన ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు.. అదే తమ డ్రీమ్ జాబ్ అని చెబుతుంటారు. అయితే గత కొంతకాలంగా ఈ పరిస్థితులు మారుతున్న పరిస్థితి.

చాలా మంది జెన్ జీ యువత ఇప్పుడు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మారుతున్న జీవన శైలి, కుటుంబ పరిస్థితులు, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు వెరసి తమ డ్రీమ్ జాబ్ కోరికకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొవాల్సిన పరిస్థితి అని అంటున్నారు. వాస్తవానికి కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీలకు ఉద్యోగుల భారం పెరిగిపోతుంది.

ఈ నేపథ్యంలో ఆర్థిక మాంద్యం సంగతి పక్కనపెట్టి.. కోవిడ్ సమయంలో ఆ మహమ్మారి పేరు చెప్పి లేఆఫ్స్ పేరుతో చాలా మంది ఉద్యోగులను బడా బడా కంపెనీలు సైతం తొలగించాయి. ఈ క్రమంలోనే 2022లో ప్రపంచవ్యాప్తంగా 1,064 ప్రధాన కంపెనీలు 1,65,269 ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించగా.. 2023లో 1,193 కంపెనీలు 1,30,482 మంది సాఫ్ట్ వేర్లను ఇంటికి పంపించాయి.

ఇక వర్క్ ఫ్రం హోం పేరు చెప్పి సుమారు అన్ని ఐటీ కంపెనీలు నియమాలకంటే అధిక సమయం పని చేయించాయని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తుంటారు. ఫలితంగా వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితంపై కూడా దీని ప్రభావం ఎక్కువగా పడిందని చెబుతున్నారు. ఇక కొత్తగా జాబ్ లో చేరాలని కలలుగంటున్న యువత సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఇంటర్వ్యూలకు వెళ్లి నెలలు గడుస్తున్నా ఎలాంటి ఆఫర్ లెటర్స్ కాని, కనీస సమాచారం కానీ లేఖ ఎదురుచూస్తున్న పరిస్థితి.

ఇలాంటి పలు కారణాలతో చాలా మంది ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి డ్రీమ్ జాబ్ కు స్వస్తి పలుకుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 50శాతానికి పైబడి ఉద్యోగులు రకరకాల కారణాలతో వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు 19శాతం మంది జెన్ జీ యువత తమ డ్రీమ్ జాబ్ ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేలు పేర్కొంటున్నాయి.

వాస్తవానికి సరైన నైపుణ్యాలున్న వారికి, అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉన్నవారికి ఏ కంపెనీలోనైనా ఉద్యోగాలు సిద్ధంగానే ఉంటున్నాయి. కాకపోతే మారుతున్న పరిస్థితులు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులు... కారణాలు ఏమైనా చాలా మంది జెన్ జీ మాత్రం తమ కలల కొలువుకు దూరమవుతున్నారని మాత్రం తెలుస్తోంది.