లోకేష్ ని ముంచుతున్న పచ్చ యూట్యూబ్ చానల్స్!
ఏది ఏమైనా అతి ఎపుడూ మంచిది కాదు ఒవరాయాక్షన్ అంతకంటే మంచిది కాదు అని అంటున్నారు. పచ్చ చానళ్ల పూనకాలు కూడా అదే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 5 Nov 2024 3:30 AM GMTతెలుగుదేశం పార్టీ భావి నాయకుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న నేత అయిన నారా లోకేష్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఫ్యూచర్ లీడర్ వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ గా కూడా ఆయనకు ట్యాగ్స్ ఇస్తున్నారు
నారా లోకేష్ సైతం గతంలో మంత్రిగా చేసినప్పటి కంటే ఇపుడు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తనకంటూ ఒక ముద్ర వేసుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అయితే నారా లోకేష్ విషయంలో తెల్లనివన్నీ పాలు నల్లవిని అన్నీ నీళ్ళు అన్న భ్రమలు కల్పిస్తూ కళ్ళకు గంతలు కట్టేలా కొన్ని పచ్చ యూట్యూబ్ చానల్స్ చేస్తున్న ప్రయత్నంతోనే ఆయనకు ఇబ్బంది వస్తోంది అని అంటున్నారు.
లోకేష్ సామర్థ్యం రుజువు చేసుకునే పనిలో ఉన్నారు. ఆయన తన తండ్రి చంద్రబాబు నీడ నుంచి బయటకు వచ్చి టీడీపీని లీడ్ చేసే ఒక పవర్ ఫుల్ లీడర్ గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. అదే సమయంలో ఆయన ఇంకా రాజకీయంగా చూస్తే తొలి దశలను దాటుతున్నారు. అపుడే ఆయనను ఎంతో ఎత్తుకు ఎత్తేసి చూపిస్తూ ఇక మొత్తం ఆయనే అన్నట్లుగా కొన్ని పచ్చ చానళ్ళు చూపిస్తున్న పైత్యం తో చినబాబుకు అసలైన బిగ్ ట్రబుల్స్ అని అంటున్నారు.
లోకేష్ మంత్రిగా కూడా తన సత్తాను చాటుకోవాలన్న ఆరాటంలో ఉన్నారు. అంతవరకూ ఆయనకు మెచ్చుకోవచ్చు. కానీ అదే సమయంలో ఆయన మీద విపరీత పొగడ్తలు కురిపిస్తూ పచ్చ చానళ్ళు ఊదుతున్న బాకా టీడీపీ భావి వారసుడికి ఇరకాటమే అని అంటున్నారు.
లోకేష్ ఇటీవల అమెరికా టూర్ చేసి వచ్చారు. వారం రోజుల పాటు ఆయన అక్కడ ఉన్నారు. అయితే లోకేష్ తన అమెరికా టూర్ లో కొంతమందిని కలిస్తే ప్రయత్నం చేశారు. ఆయన తపనను ఇక్కడ చూడకుండా లోకేష్ ఎపీకి కోట్లలో పెట్టుబడులు తెచ్చేశారు ఇక లోటేముంది అన్నట్లుగా చిత్రీకరిస్తున్న తీరుతోనే అసలు తంటా అని అంటున్నారు.
ఇక పచ్చ యూట్యూబ్ చానళ్ల పూనకం ఒక రేంజిలో ఉంది. వారికి వారే అనుకుని ఒక బిగ్ నంబర్ ని కూడా ఇచ్చేస్తున్నారు. లోకేష్ ఏపీకి ఏకంగా లక్ష కోట్ల పెట్టుబడులు అలాగే యాభై వేల కోట్ల పెట్టుబడులు తెచ్చేస్తున్నారు అని కూడా వారు లెక్కలేసి మరీ బిగ్ సైజ్ లో చూపించేస్తున్నారు.
అసలు లక్ష కోట్లకు ఎన్ని సున్నాలు ఉంటాయో వీరికి తెలుసా అని ఈ ఓవర్ యాక్షన్ చూసిన వారు అంటున్నారు. లోకేష్ మెప్పు పొందాలని ఆయన కోసం పనిచేస్తున్నామని చెప్పుకోవాలని ఆరాటపడుతున్న ఈ పచ్చ యూ ట్యూబ్ చానల్స్ ఈ ఉత్సాహంలో తాము ఆయనకు చేసేది మేలు కాదు కీడు అని గ్రహించలేకపోతున్నాయి అని అంటున్నారు
లోకేష్ అయితే తాజా అమెరికా టూర్ లో తనను తాను ఇంట్రడక్షన్ చేసుకోవడానికి అని అంటున్నారు. ఐటీ మంత్రిగా ఆయన తొలి ప్రయత్నంగా దీనిని చూడాలి. ఈ మీదట ఆయన మరిన్ని టూర్లు చేస్తూ పోతే ఏపీకి ఫలితం ఉంటుంది. అంతే తప్ప మొదటిసారి ఇలా వెళ్ళి అలా లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేయడం అన్నది కుదురుతుందా అని అంటున్నారు.
రేపటి రోజున ఈ భారీ నంబర్ తో బాకా ఊదుతున్న వారు అనుకున్న దాంట్లో ఎంతో కొంత పెట్టుబడులు వస్తే అపుడు ఏమని తమ చానళ్ళలో రాతలు రాస్తారు ఏ విధంగా చూపిస్తారు అని కూడా అంటున్నారు. అందువల్ల లోకేష్ ని ఎలాగోలా మోసేయాలని పడే ఆరాటంలో ఆయన ఇమేజ్ కి ఇబ్బంది తెస్తున్నామని పచ్చ యూ ట్యూబ్ చానల్స్ ఏ మాత్రం గుర్తించడం లేదు అని అంటున్నారు. ఇదే తీరున వీరంతా బాకాలు ఊదుతూ భజంత్రీలు పాడుతూ పోతూంటే మాత్రం అంతిమంగా టీడీపీకి చినబాబుకే చేటు అవుతుందని అంటున్నారు.
ఏది ఏమైనా అతి ఎపుడూ మంచిది కాదు ఒవరాయాక్షన్ అంతకంటే మంచిది కాదు అని అంటున్నారు. పచ్చ చానళ్ల పూనకాలు కూడా అదే లెవెల్ లో ఉన్నాయని అంటున్నారు. దీనిని చూసిన వారు అంతా ఈ టైప్ ఆఫ్ ఓవర్ యాక్షన్ తో తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు.