Begin typing your search above and press return to search.

కోటికి పైగా సంపాదన... యూట్యూబర్ ఇంటిపై ఐటీ దాడి!

ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీకి చెందిన తస్లీమ్‌

By:  Tupaki Desk   |   18 July 2023 4:23 AM GMT
కోటికి పైగా సంపాదన... యూట్యూబర్ ఇంటిపై ఐటీ దాడి!
X

సాధారణంగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైడ్స్ జరిగాయి అనే వార్తలు వస్తే... అది ఏ పారిశ్రామికమికవేత్త ఆఫీసులోనో, ఇంటిలోనో.. లేక, రాజకీయ నాయకుడి ఇంట్లో.. సినీ నటుటుల ఇంట్లో.. ప్రభుత్వ అధికారి ఇంట్లో అని చాలామంది అనుకుంటారు! కానీ తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ యూట్యూబర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి.

అవును... ఉత్తరప్రదేశ్‌ లోని బరేలీకి చెందిన తస్లీమ్‌ అనే యూట్యూబర్‌ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిపారని తెలుస్తుంది. ఈ దాడుల్లో ఆ ఇంట్లో రూ.24లక్షలు గుర్తించినట్టు అధికారులు చెప్పారని సమాచారం. అయితే కేవలం యూట్యూబ్ ద్వారానే కాకుండా... చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా ఇంత మొత్తాన్ని సంపాదించాడని అధికారులు ఆరోపిస్తున్నారంట.

తాజాగా ఈ యూట్యూబర్ యూట్యూబ్ వీడియోల ద్వారా దాదాపు కోటి రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపణ ఉందట. దీంతో ఇతని ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారట.

ఈ దాడుల్లో సుమారు రూ.24 లక్షలు గుర్తించారని తెలుస్తుంది. అయితే ఐటీ అధికారుల ఆరోపణలను అతడి కుటుంబ సభ్యులు తోసిపుచ్చారని తెలుస్తుంది.

అయితే ఈ విషయాలపై అతని సోదరుడు ఫిరోజ్ స్పందించారని అంటున్నారు. తమ మొత్తం యూట్యూబ్ ఆదాయం రూ. 1.2 కోట్లు కాగా ఇప్పటికే రూ. 4 లక్షల పన్నులు చెల్లించినట్లు పేర్కొన్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో... తాము ఎటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని.. కేవలం చట్టబద్ధమైన యూట్యూబ్ ఛానెల్‌ ని మాత్రమే నడుపుతున్నట్లు చెప్పారని తెలుస్తుంది.

అయితే యూట్యూబ్, ఇన్‌ స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ ఫారమ్‌ లలో తమ ఆదాయాన్ని, లాభాలను వారి ఆదాయాలకు అనుగుణంగా చూపించడం లేదని ఆరోపించినందుకు సోషల్ మీడియా ఇన్‌ ఫ్లుయెన్సర్‌ లు, కంటెంట్ క్రియేటర్‌ లపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారని అంటున్నారు.