Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్!

ఈ క్రమంలో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   10 July 2024 12:02 PM GMT
బిగ్  బ్రేకింగ్... యూట్యూబర్  ప్రణీత్  హనుమంతు అరెస్ట్!
X

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనే పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. డార్క్ కామెడీ, ర్యాంట్ వీడియోస్ పేరిట నచ్చని వాళ్లని విపరీతంగా, ఇష్టానుసారంగా ట్రోల్ చేయడం వీళ్ల హాబీ అని అంటున్నారు! ఈ క్రమంలోనే తండ్రీకూతుళ్ల బంధంపైనా పిచ్చి ప్రేళాపనలు పేలారు. ఈ క్రమంలో ఇతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... తండ్రీకూతుళ్ల బంధంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యారు. బుధవారం ఇతడిని బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో హైదరాబాద్ కు తీసుకురానున్నారని తెలుస్తుంది. ఇతడిపై తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కాగా... కొన్నేళ్లుగా తన బ్యాచ్ తో కలిసి వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతుండటం ఓ పనిగా పెట్టుకున్నాడు ప్రణీత్ హనుమంతు! ఈ సమయంలో ఇతడి తీరుపై టాలీవుడ్ హీరో సాయిదుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యారు. ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతూ... ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజ్ఞప్తి చేశారు!

దీంతో ఈ విషయం ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అతడి ఆచుకీ కనిపెట్టి బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. అక్కడే అతడిని కోర్టులో హాజరుపరిచారని తెలుస్తుంది. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ ద్వారా అతడిని హైదరాబాద్ కు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు నమోదు చేశారని తెలుస్తుంది! అతడితో పాటు అతని ముగ్గురు స్నేహితులనూ అరెస్ట్ చేసే ప్రయత్నంలో చివరి దశలో ఉన్నారని అంటున్నారు!!