Begin typing your search above and press return to search.

చంచల్‌ గూడ జైలుకి యూట్యూబర్ ప్రణీత్... 14 రోజుల రిమాండ్!

ఈ నేపథ్యంలో అతడిని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ప్రవేఅపెట్టారు పోలీసులు.

By:  Tupaki Desk   |   11 July 2024 1:13 PM GMT
చంచల్‌  గూడ జైలుకి యూట్యూబర్  ప్రణీత్... 14 రోజుల రిమాండ్!
X

విచక్షణ మరిచి తండ్రీకూతుళ్ల బంధానికి కూడా అసభ్యాన్ని, అశ్లీలాన్ని జోడించి మాట్లాడిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. సెలబ్రెటీలు, ప్రజానికం డిమాండ్ మేరకు స్పందించిన తెలంగాణ పోలీస్.. ఇతడిపై కేసు నమోదు చేసింది. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించింది.

ఈ నేపథ్యంలో అతడిని హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో ప్రవేఅపెట్టారు పోలీసులు. దీంతో... నాంపల్లి కోర్టు ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ప్రణీత్ పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ 79, బీ.ఎన్.ఎస్. సెక్షన్ 294 ప్రకారం కేసులు నమోదు చేశారు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు.

అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో.. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ప్రణీత్ ఏ1 కాగా... ఏ2గా డల్లాస్ నాగేశ్వర రావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా ఆదినారాయణను చేర్చారు.

కాగా... ప్రణీత్ ను బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. అనంతరం రహస్య ప్రాంతంలో విచారించారని తెలుస్తోంది. ఇతని తీరును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ విభాగం సీరియస్ గా తీసుకుంది. తెలంగాణ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కూడా ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.

తండ్రీకూతుళ్ల బంధంపై సోషల్ మీడియాలో చర్చ పెట్టిన ప్రణీత్ హనుమంతు అభ్యంతరకర, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు! ఈ నేపథ్యంలో అతడితో పాటు ఆ కార్యక్రమంలో భాగస్వాములైన మరో ముగ్గురిపైనా సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రణీత్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.