పిక్ వైరల్... లండన్ వీధుల్లో స్టైలిష్ జగన్ ని చూశారా?
ముఖ్యమంత్రి కాకముందు ఉన్నంతలో కాస్త కలర్ ఫుల్ చొక్కాలు వేసుకునే జగన్... సీఎం అయిన తర్వాత పూర్తిగా తెల్ల షర్టు, ఖాకీ ఫ్యాంటుకే పరిమితమైపోయారు.
By: Tupaki Desk | 29 Jan 2025 6:28 AM GMTఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రతిష్టాత్మక కింగ్స్ కాలేజ్ నుంచి తన కుమార్తె వర్షారెడ్డి మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫైనాన్స్) పట్టా పుచ్చుకున్న కార్యక్రమంలో పాల్గొనడానికి తన సతీమణితో కలిసి లండన్ వెళ్లారు.. ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం తన సతీమణి భారతి, ఇద్దరు కుమర్తెలతో జగన్ లండన్ లో ఉన్నారు. త్వరలో ఆయన భారత్ కు తిరిగిరానున్నారని అంటున్నారు. ప్రధానంగా సాయిరెడ్డి రాజీనామాపై జగన్ స్పందన కోసం జనం ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా లండన్ వీధుల్లో జగన్ స్టైలిష్ లుక్ కి సంబంధించిన పిక్ తెరపైకి వచ్చింది.
అవును... ముఖ్యమంత్రి కాకముందు ఉన్నంతలో కాస్త కలర్ ఫుల్ చొక్కాలు వేసుకునే జగన్... సీఎం అయిన తర్వాత పూర్తిగా తెల్ల షర్టు, ఖాకీ ఫ్యాంటుకే పరిమితమైపోయారు. ఏడాది పొడవునా అదే లుక్ లో కనిపిస్తుంటారు. అయితే... తాజాగా లండన్ పర్యటనలో ఉన్న జగన్... జీన్స్, టీషర్ట్, స్టైలిష్ జాకెట్ తో కనిపించారు.
సాధారణంగా జగన్ విదేశాలకు వెళ్లినప్పటి ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ఎప్పుడు సింపుల్ గా కనిపించే జగన్.. అక్కడకు వెళ్లిన తర్వాత జీన్స్, టీ షర్ట్స్, షూస్, స్టైలిష్ జాకెట్స్ ధరించి కనిపిస్తుంటారు. వాటికి సంబంధించిన ఫోటోలను ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తెగ షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ పిక్ తెరపైకి వచ్చింది.
ఈ ఫోటోలో ఓ పసి బిడ్డను ఎత్తుకున్న జగన్.. బ్లాక్ జీన్ ఫ్యాంటు, బ్లాక్ టీ-షర్ట్, పైన గోదుమరంగు జాకెట్ ధరించి కనిపించారు. ఈ డ్రెస్ లో జగన్ చాలా డైనమిక్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నారనడంలో సందేహం లేదనే చెప్పాలి! ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట సందడి చేయడం మొదలుపెట్టాయి.