మీటింగ్ ఏదైనా జగన్ స్పీచ్ లో ఆ 'కథ' కామన్!
ఈ క్రమంలో తాజాగా నేడు (జనవరి 8 - బుధవారం) నాడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు.
By: Tupaki Desk | 8 Jan 2025 12:35 PM GMTఏపీలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైసీపీ శ్రేణులు తీవ్ర షాక్ కి గురయ్యారనే కథనాలూ వినిపించిన సంగతి తెలిసిందే. ఓడిపోవడం ఒకెత్తు అయితే.. మరీ 11 స్థానలకు పరిమితం అవ్వడం మరొకెత్తు అన్నట్లుగా స్పందించారని అనేవారు! ఆ సమయంలో కాస్త తేరుకున్న జగన్... ఓ ఆసక్తికర విషయం చెప్పేవారు.
ఫలితాలు వచ్చిన మొదట్లో ఈ ఘోర పరాజయానికి లిక్కర్ పాలసీనే కారణం అని ఒకరంటే.. ఈవీఎం ల మోసం అని మరికరు ప్రజెంటేషన్స్ ఇచ్చేవారు. జగన్ కూడా మొదట్లో వీటిపై కాస్త నిగూఢమైన కామెంట్లే చేసేవారు కానీ.. తర్వాత కాలంలో ఓ ఆసక్తికర విషయం చెప్పేవారు. అదే... "పలావ్ - బిర్యానీ" కథ. ఈ సమయంలో తాజాగా మరోసారి ఆ విషయం చెప్పారు జగన్.
అవును... తాము అధికారంలో ఉండగా ప్రతీ నెలా ప్రజలకు ఏదో ఒక పథకం ద్వారా నగదు బదిలీ జరిగేదని.. అన్ని వర్గాలనూ సంతృప్తి పరుస్తూ ప్రతీ ఇంటికీ అండగా ఉండేలా తమ పాలన సాగిందని.. ఆ విధంగా నాడు తమ ప్రభుత్వ పాలనలో పలావ్ పెట్టేవాళ్లమని చెప్పిన జగన్.. చంద్రబాబు బిర్యానీ పెడతానంటే ప్రజలు పెద్ద ఎత్తున నమ్మారని చెప్పేవారు.
అయితే... తీరా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పలావూ పోయింది, ఇటు బిర్యానీ పోయిందని జనాలు గగ్గోలు పెడుతున్నారని జగన్ వెల్లడించేవారు. సుమారు గత ఏడు నెలలుగా జగన్ మైకు పట్టుకున్న ప్రతీ సందర్భంలోనూ ఈ "పలావ్ - బిర్యానీ" కథ చెప్పడం.. అక్కడున్న వారి నుంచి ఆసక్తికర రియాక్షన్ రావడం కామన్ గా మారిపోయింది.
ఈ క్రమంలో తాజాగా నేడు (జనవరి 8 - బుధవారం) నాడు తాడేపల్లిలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్... మరోసారి "పలావ్ - బిర్యానీ" కథ చెప్పడం గమనార్హం.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అంతా అనుకుంటారు కానీ.. ఆరు నెలలకే ఈ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత వచ్చేసిందని.. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలను, మేనిఫెస్టోలోని హామీలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారు.కానీ, ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను, మేనిఫెస్టోలో హామీలను పూర్తిగా గాలికొదిలేశారు. ప్రతీ ఇంట్లో ఇదే చర్చ కొనసాగుతోంది. మనం ఇచ్చిన పథకాలను రద్దుచేశారు, అవి అమలు కావడంలేదున్నారు.
ఇదే సమయంలో... ప్రతీ నెలా ఏదో ఒక పథకం ద్వారా ప్రజలకు మేలు చేశామని.. ఆ విధంగా మనం పలావ్ పెట్టేవాళ్లమని.. అయితే చంద్రబాబు బిర్యానీ పెడతానంటే నమ్మారని.. ఇప్పుడు రెండూ పోయాయని.. ఈ సమయంలో ప్రజలు జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడాను గమనిస్తున్నారని.. ప్రతీ ఇంట్లోనూ ఇదే చర్చ కొనసాగుతోందని జగన్ తెలిపారు.