పోరాటమే దిక్కయినప్పుడు.. జగన్ చేస్తున్నదేంటి..!
ఇక, ఆస్తుల వివాదంలో షర్మిల కన్నీరు పెట్టుకున్నప్పుడు.. జగన్ ఎంతో చేసినా.. ఆయనను రోడ్డుకు ఈడ్చారంటూ ఈ అనుకూల మీడియా, ఈ అనుకూల వ్యక్తులు తీవ్రస్థాయిలో విజృంభించారు.
By: Tupaki Desk | 14 Nov 2024 5:34 AM GMTపోరాటమే దిక్కయినప్పుడు పిల్లి కూడా.. పంజా విసురుతుంది! అలాంటిది.. బలమైన కేడర్, అంతకు మించిన నిశ్చయ ఓటు బ్యాంకు ఉన్న వైసీపీ ఇప్పుడు ఏం చేస్తోంది? ఏం చేయాలి? అనేది చర్చకు వస్తోంది. నిజానికి జగన్‌పై ఈగ వాలనివ్వని వ్యక్తులు ఉన్నారని చాలా మందికి తెలుసు. మేధావులు కూ డా ఉన్నారు. ఆయన ఏం చేసినా.. అందులో మంచిని వెతికి పట్టుకుని చెడును కడిగేందుకు ప్రయత్ని స్తున్నవారు కూడా ఉన్నారు.
వీరితోపాటు సొంత మీడియా.. దీనికి అనుబంధంగా అనుకూల మీడియా కూడా ఉన్నాయి. జగన్‌కు తక్కు వో ఎక్కువో సపోర్టు చేస్తున్న మీడియా అయితే ఉంది. వీరంతా.. కూడా జగన్‌కు అనుకూలంగా వ్యవహ రించిన వారే. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు సంఖ్యా బలాన్ని పక్కన పెట్టి మా నేతకు 40 శాతం మంది ఓటర్లు అండగా ఉన్నారంటూ కవర్ చేశారు. జగన్ ఓడిపోయినా.. `ప్రజల మనసు గెలిచి ఓడారం టూ` కొత్త అర్థాలు వెతికారు.
ఇక, ఆస్తుల వివాదంలో షర్మిల కన్నీరు పెట్టుకున్నప్పుడు.. జగన్ ఎంతో చేసినా.. ఆయనను రోడ్డుకు ఈడ్చారంటూ ఈ అనుకూల మీడియా, ఈ అనుకూల వ్యక్తులు తీవ్రస్థాయిలో విజృంభించారు. ఇదంతా నిన్న మొన్నటి విషయమే. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇప్పుడు ఇదే అనుకూల మీడియా, ఇవే అనుకూల శక్తులు జగన్‌ను కడిగి పారేస్తున్నాయి. ఇది మంచిది కాదు జగన్! అని బిగ్గరగానే చెబుతున్నా యి. దీనికి కారణం జగన్ అసెంబ్లీకి వెళ్లనని బీష్మించడమే!!
నిజానికి ఇక్కడ ఎంత సమర్థించాలని చూసినా సమర్థించలేని ప్రజాస్వామ్యం.. కాళ్లు కట్టేస్తోంది.. నోళ్లు కుట్టేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సభకు వెళ్లితీరాలని ఇతర పక్షాలు కాదు.. అనుకూల మీడియాలోనే కాకుల్లా పొడిచే.. సూటి పోటి మాటలతో జగన్‌కు గట్టిగానే హితవు పలుకుతున్నా రు. `పోరాటమే దిక్కయినప్పుడు.. తాడే పేడో తేల్చుకునేందుకు అసెంబ్లీనే అసలైన వేదిక`` అంటూ నూరి పోస్తున్నాయి. అయినా.. జగన్ వినిపించుకోకపోతే.. రేపు ఈ మీడియాకూడా కాడి పడేస్తుంది.
ఎందుకంటే.. ఎవరికైనా ప్రజా మద్దతే అవసరం కదా! దానిని జగన్ పోగొట్టుకోవాలని అనుకుంటే.. ఎంత అనుకూల మీడియా అయినా.. ప్రజల మద్దతు అవసరం లేదని అనుకోదు. అందుకే.. పోరాటమే దిక్కయినప్పుడు జగన్ సభకు వెళ్లితీరాల్సిందేనని అన్ని మీడియాలూ చెబుతున్న మాట. ఇది ప్రజా వాణి. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకుంటే మేలు ఖాయం!!