వైఎస్ జగన్, భారతిపై విజయమ్మ షాకింగ్ కామెంట్స్!
సరస్వతి కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి వైఎస్ జగన్ హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 11 Feb 2025 5:13 AM GMTషేర్ల బదిలీ విషయంలో వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ విచారణ చేపట్టింది. గత ఏడాది హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో సరస్వతి కంపెనీ షేర్ల బదిలీకి సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. స్పందించిన విజయమ్మ.. తన కుమారుడు, కొడలిపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
అవును... సరస్వతి కంపెనీలో షేర్ల బదిలీకి సంబంధించి వైఎస్ జగన్ హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని వైఎస్ విజయమ్మ, షర్మిల తో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఇదే విషయాన్ని జగన్ తరుపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా... కౌంటర్ దాఖలుకు సమయం కావాలని విజయమ్మ తరుపు న్యాయవాది కోరారు. దీంతో... ఇరు పక్షల వాదనలు విన్న ట్రైబ్యునల్.. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.
వాస్తవానికి సరస్వతి పవర్ కంపెనీలో తన పేరు మీద, తన భార్య భారతి, క్లాసిక్ రియాలిటీ పేరున ఉన్న షేర్లను తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, జనార్ధన్ రెడ్డి అక్రమంగా బదిలీ చేసుకున్నారని జగన్ ఫిర్యాదు చేశారు! ఈ సందర్భంగా... సరస్వతి పవర్ లో తమకు 51.01 శాతం వాటా ఉన్నట్లు పిటిషన్ లో పేర్కొన్నారు.
భవిష్యత్తులో షర్మిలకు షేర్లను బదిలీ చేసేలా ఆగస్టు 31 - 2019న అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత సరస్వతీ పవర్ లో జగన్ కు చెందిన సండూర్ పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న మొత్తం షేర్లు, క్లాసిక్ రియాల్టీకి చెందిన వాటాలు కలిపి మొత్తం రూ.1.21 కోట్లకు పైగా షేర్లను 2021 జూన్ 2న విజయమ్మకు బదిలీ చేసినట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే తాను గిఫ్ట్ గా ఇచ్చిన షేర్లను షర్మిలకు బదలాయించడం చట్టవిరుద్ధమని.. ఈ షేర్ల బదలాయింపును అడ్డుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్ పై విచారణ జరగ్గా.... కౌంటర్ దాఖలుకు విజయమ్మ తరుపు న్యాయవాది సమయం కోరడంతో వచ్చే నెల 6కు విచారణ వాయిదా వేశారు.
ఈ సందర్భంగా స్పందించిన విజయమ్మ... జగన్, భారతి చేస్తున్న ఆరోపణలను ఖండించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తన కుమారుడు, కోడలు పేర్కొంటున్న విషయాలు నిరాధారమైనవని.. ఆ ఆరోపణలు న్యాయ సమీక్షకు నిలవవు అని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో... తన పిల్లల మధ్య వివాదాల కారణంగా తాను కోర్టు గదిలో నిలబడాల్సి రావడం తీవ్రంగా కలిచివేస్తోన్నట్లు తెలిపారని అంటున్నారు. బాధాతప్త హృదయంతోనే కౌంటర్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారని తెలుస్తోంది.