అన్నా చెల్లెళ్ల రాజకీయాలు మారాల్సిందే.. లేకపోతే.. ?
అయినా.. ఇరు పక్షాల్లోనూ ఆశించిన మార్పు కనిపించడం లేదు. వారి మార్గాల్లోనూ మార్పు రాలేదు.
By: Tupaki Desk | 6 Feb 2025 10:30 PM GMTఏపీలో అన్నా చెల్లెళ్లు జగన్, షర్మిల ఇద్దరూ రాజకీయాల్లోనే ఉన్నారు. ఇద్దరూ పార్టీలకు అధినేతలుగా ఉన్నారు. గత ఎన్నికల్లో హోరాహోరీగా అన్నకు వ్యతిరేకంగా చెల్లెలు రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. ఇక, జగన్.. సంక్షేమం పేరుతో రాజకీయాలు చేశారు. ఈ రెండు కూడా వికటించాయి. ప్రజలు ఇద్దరికీ తగిన బుద్ధి చెప్పారు. ఇప్పటికి ఏడు మాసాలు పూర్తయ్యాయి. అయినా.. ఇరు పక్షాల్లోనూ ఆశించిన మార్పు కనిపించడం లేదు. వారి మార్గాల్లోనూ మార్పు రాలేదు.
అయితే.. ఎప్పటికీ అలానే ఉంటామని వారు నిర్ణయించుకుంటే.. అది వారికే నష్టమన్న సంగతి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎంత సేపూ అన్ననే విమర్శిస్తూ.. షర్మిల ఇమేజ్ ఇప్పటికే పడిపోయింది. సీనియర్లు కూడా.. ఆమెఏవగించుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఏడు మాసాల తర్వాత.. కూడా జగన్ పాలనపైనే విమర్శలు సంధిస్తే వ్యక్తిగతంగా నాలుగు గోడల మధ్య షర్మిల ఆనంద పడొచ్చు. కానీ, జనాల్లో కి వస్తే.. మాత్రం అది సరికాదన్న సూచనలు వస్తున్నాయి.
కాబట్టి పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో మూడు రీజన్లు కనిపిస్తున్నాయి.
1) పాత నేతలను పుంజుకునేలా చేయాలి.
2) ఎన్నికల సమయంలో ఎలా అయితే.. విస్తృతంగా ప్రజల మధ్యకు వెళ్లారో.. ఇప్పుడు కూడా అదే పంథాను అనుసరించాలి. ప్రజలను కలుసుకోవాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. వాటిని పరిష్కరించేలా పోరాటాలకు నాంది పలకాలి.
3) తనేమిటో నిరూపించుకునే దిశగా షర్మిల అడుగులు వేయాలి. ఈ మూడు చేస్తేనే ఆమె పుంజుకునే అవకాశం ఉంటుంది.
ఇక, జగన్ విషయానికి వస్తే..
ఫస్ట్ చేయాల్సిన పని.. ఆయన నేరుగా అసెంబ్లీకి వెళ్లడం. తన వారిని ప్రోత్సహించి అసెంబ్లీలో కూర్చునేలాచేయడం.
2) ప్రజా సమస్యలపై పోరాటానికి రోడ్డెక్కడం. ఇక్కడ నా మూషీ పడడానికి వీల్లేదు. 14 ఏళ్ల సీఎంఅయిన చంద్రబాబు వైసీపీ హయాంలో రోడ్డెక్కిన విషయాన్ని జగన్ గుర్తు చేసుకోవాలి.
3) పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. ఈ మూడు చేయడం ద్వారానే పార్టీని నిలబెట్టుకునేందుకు తటస్థుల్లోనూ జగన్ విషయంలో సానుకూల దృక్ఫథం పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి అన్నాచెల్లెళ్లు ఏం చేస్తారో చూడాలి.