ఆ ముద్ర చెరుపుకునే పనిలో షర్మిల?... కీలక వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా షర్మిల లేవనెత్తిన పాయింట్లు ఈ విధంగా ఉన్నాయి...!
By: Tupaki Desk | 3 Nov 2024 3:59 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో ఒకటైన "ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు" పథకాన్ని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై ఇప్పటికే వైసీపీ నుంచి పలు కామెంట్లు వినిపించిన నేపథ్యంలో.. తాజాగా ఏపీ పీసీ చీఫ్ స్పందించారు. ఈ సందర్భంగా ఏడు పాయింట్లతో కూటమి ప్రభుత్వాన్ని తగులుకున్నారు.
అవును... ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకాని దీపావళి కానుకగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పథకాన్ని, కరెంట్ బిల్లులతో లింక్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. గత ప్రభుత్వంలో చేసిన పనులను ఎత్తి చూపుతూ, కూటమి ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు షర్మిల.
ఇందులో భాగంగా... ఉచితంగా ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామంటూ.. టీడీపీ - జనసేన - బీజేపీలు గఫ్పాలు కొట్టుకుంటున్నాయని షర్మిల విమర్శించారు. దీపం పథకం తో ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూనే మరోపక్క విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరు చెప్పి వాతలు పెడుతున్నారని ఆరోపించారు.
ఈ సందర్భంగా షర్మిల లేవనెత్తిన పాయింట్లు ఈ విధంగా ఉన్నాయి...!
* ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద ఏడాదికి ప్రజలకు ఇచ్చేది రూ.2,685 కోట్లు కాగా.. కరెంటు బిల్లుల రూపంలో ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది మాత్ర్మ్ రూ.6వేల కోట్లు.. అంటే.. ఇంకా మూడు వేల కోట్ల రూపాలు ప్రజలపై అదనపు భారం పడుతుంది.
* దీపం-2 కింద వెలుగుల సంగతి పక్కనపెడితె... కరెంటు బిల్లుల రూపంలో పేద కుటుంబాలో కూటమి ప్రభుత్వం కారు చీకట్లు నింపుతోంది.
* గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపమే ఇదని.. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతూ బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది ఈపీఆర్సీ తప్ప.. తాము కాదంటూ చెప్తున్నవి కుంటిసాకులు తప్ప మరొకటి కాదు.
* ఇదే క్రమంలో... గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని.. తము అధికారంలోకి వస్తే ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని.. అవసరమైతే 35శాతం ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
* అదేవిధంగా... వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9సార్లు ఛార్జీలు పెంచితే.. మీరు మొదలుపెట్టారు కాదా? ఇక మీకూ వాళ్లకూ తేడా ఏమిటి? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేలకోట్లు ప్రజలపై భారం మోపితే.. మీరు కూడా భారం మోపడం మొదలుపెట్టారు కదా? ఇక మీకూ వాళ్లకూ ఏమిటి తేడా?
* రూ.6 వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కదా.. సాయం తీసుకురండి. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం.
* ప్రజలపై సర్దుబాటు ఛార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5న రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది.
అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిళ. దీంతో... కరెంటు ఛార్జీల పెంపు విషయంలో షర్మిల సీరియస్ గానే రియాక్ట్ అవుతున్నారని ఒకరంటే... షర్మిల కూడా కూటమి తానులోముక్కే, చంద్రబాబు రహస్య కూటమిలో భాగమే అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. రెండో కామెంట్ ని, ఆ ముద్రని చెరిపేసుకునే ప్రయత్నంగా మరికొంతమంది చూస్తున్నారు!