Begin typing your search above and press return to search.

జర్నలిస్టులకు బాబు చేయలేనిది జగన్ చేస్తున్నారా...?

ఉమ్మడి ఏపీ తీసుకున్నా లేక విభజన ఏపీ అయినా జర్నలిస్టులకు మేలు జరిగినది మాత్రం కాంగ్రెస్ హయాంలోనే అని అంతా అంటారు.

By:  Tupaki Desk   |   4 Nov 2023 3:45 AM GMT
జర్నలిస్టులకు బాబు చేయలేనిది జగన్ చేస్తున్నారా...?
X

ఉమ్మడి ఏపీ తీసుకున్నా లేక విభజన ఏపీ అయినా జర్నలిస్టులకు మేలు జరిగినది మాత్రం కాంగ్రెస్ హయాంలోనే అని అంతా అంటారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చారు చివరి సారిగా వైఎస్సార్ ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండగా 2005లో పెద్ద ఎత్తున నాటి ఇరవై మూడు జిల్లాల జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలను అందించి ఎనలేని మేలు చేశారు.

ఆ తరువాత ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా ఏమీ మేలు జరగలేదు. ఇక చూస్తే విభజన ఏపీలో 2014లో చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పారు. అది కూడా 2018లో చివరిలో కార్యాచరణ మొదలెట్టామని అన్నారు.

తీరా జర్నలిస్టులు అంతా ఆశపడి ఆన్ లైన్ లో దరఖాస్తులు పూర్తి చేశారు. కానీ ఈలోగా కొంత ఆలస్యం అయింది ఎన్నికల కోడ్ అమలులోని వచ్చింది. ఆ విధంగా జర్నలిస్టులు తీరని నిరాశకు లోను అయ్యారు. ఇక పాదయాత్రలో జగన్ జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇస్తాను అని హామీ ఇచ్చారు. జగన్ సైతం అయిదేళ్ల తరువాత చివరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడా వైఎస్సార్ ఎక్కడ అపేశారో 2006 నుంచి 2023 దాకా ఉన్న పాత్రికేయులు అందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నారు.

అయితే జగన్ ప్రభుత్వం చాలా తొందరగా ఇళ్ళ స్థలాలను పాత్రికేయులకు అందించేందుకు రంగం సిద్ధం చేయాలని అంతా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏపీలో ఎన్నికలకు కేవలం నాలుగు నెలలు మాత్రమే సమయం ఉంది. దాంతో జర్నలిస్తుల దశాబ్దాల్ కల నెరవేరాలీ అంటే కనుక కచ్చితంగా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగానే చేయాల్సింది చేయాల్సి ఉంది.

మరో వైపు చూస్తే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక సెక్షన్ ఆఫ్ మీడియాతో యుద్ధమే సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు సైతం బాహాటంగానే ఫలనా మీడియా యజమానులు టీడీపీ అనుకూల వర్గాలు అని చెబుతూ వస్తున్నారు. ఇలా అటూ ఇటూ రాజకీయాలు చేరిపోయి ఏపీలో జర్నలిజానికి ఇబ్బంది కలిగిస్తున్నాయి.

సగటు జర్నలిస్టు కూడా ఆయా పార్టీలకు అనుకూలురు అన్నట్లుగానే ప్రత్యర్ధి పార్టీలు భావించే పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్న వేళ జర్నలిస్టు ఏ పత్రికలో చేసినా అతనికి రాజకీయ రంగు అంటదని అతను చేసేది భుక్తి కోసమని భావించి ఏ తేడాను గుర్తించి వైసీపీ ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇవ్వడానికి ముందుకు రావడం హర్షించతగిన పరిణామం అని అంటున్నారు.

మరి ఎన్నికల వేళ వేలాది జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం న్యాయం చేస్తే దాని ఫలితాలు వైసీపీకి ఎంతమేరకు అందుతాయన్నది కూడా చర్చగా ఉంది. ఏది ఏమైనా మునుపటి వ్యతిరేకతతో అయితే సగటు పాత్రికేయుడు రాయలేడు అనుకోవాలి. కానీ మీడియా యాజమాన్యాలు అజెండానే ఎవరైనా అమలు చేయాలని అనుకున్నపుడు వృత్తి వృత్తే బతుకు బతుకే అన్నట్లుగా ఉంటుంది. మరి ఇవన్నీ గ్రహించుకునే వైసీపీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సిద్ధపడుతోంది అని అంటున్నారు. ఏదేమైనా సమాజంలో వారధులుగా ఉండే జర్నలిస్టుల పట్ల సాఫ్ట్ కార్నర్ గా ఉండడం ఏ ప్రభుత్వానికి అయినా మంచే చేస్తుంది అని అంటున్నారు.