Begin typing your search above and press return to search.

లండన్ లో నవ్వుతూ జగన్... పిక్ వైరల్!

లండన్ లో జగన్ సంగతి అలా ఉంటే... మరోపక్క ఏపీలో ఊహించని పరిణామాలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   11 Sep 2023 6:57 AM GMT
లండన్ లో నవ్వుతూ జగన్... పిక్ వైరల్!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల రెండో తేదీన ఆయన తన సతీమణి భారతితో కలిసి లండన్ ప్రయాణమై వెళ్లారు. సుమారు 10 రోజుల పాటు ఉన్న ఈ పర్యటనలో తన ఇద్దరు కుమార్తెలకు ఆయన విలువైన సమయాన్ని వెచ్చించేలా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తుంది!

అవును... వైఎస్ జగన్ తన లండన్ పర్యటనను పూర్తి వ్యక్తిగత పర్యటనగా మలుచుకున్నారు. రాజకీయాలకు, భేటీలకు, పాలనకు పదిరోజులు విరామం ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఫ్యామిలీతో నాలుగురోజులు ప్రశాంతంగా గడిపారు! ఈ పర్యటనపై "మీకెంత తెలుసో నాకూ అంతే తెలుసు" అంటూ యూకే వైసీపీ కన్వీనర్ చెప్పారంటే... జగన్ ఈ టూర్ ని ఎంత పర్సనల్ ట్రిప్ గా ప్లాన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.

లండన్ లో జగన్ సంగతి అలా ఉంటే... మరోపక్క ఏపీలో ఊహించని పరిణామాలూ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడకు తరలించి సిట్ అధికారుల ముందు ప్రవేశపెట్టారు.

ఇదే క్రమంలో ఆదివారం ఉదయం కోర్టులో ప్రవేశపెట్టగా... సాయంత్రం చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో బాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు! అక్కడ బాబుకు 7691 అనే ఖైదీ నెంబర్ ను కేటాయించి, స్నేహ బ్లాక్ లో ఒక గదిని కేటాయించారు. ఇంటి నుంచి బోజనం, మెడిసిన్స్ తెప్పించుకోవచ్చని కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇన్ని సంచలన పరిణాలు జరుగుతున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ టూర్ లో ఉండటం గమనార్హం. ఈ సమయంలో జగన్ కు సంబంధించిన ఒక పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లండన్ లో తీసినట్లున్న ఈ ఫోటోలో వైఎస్ జగన్ స్టైలిష్ లుక్ లో పక్కనున్నవారితో ఫుల్ జోష్ లో నవ్వుతున్నట్లు కనిపించారు.

అవును... ఎప్పుడూ క్రీం కలర్ ఫ్యాంటూ, వైటు షర్ట్ ధరించి క్యాజువల్ స్లిప్పర్స్ ధరించి కనిపించే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్... ఈ ఫోటోలో మాత్రం స్టైలిష్ లుక్ లో ఫుల్ యంగ్ & ఎనర్జిటిక్ గా కనిపించడం గమనార్హం. ఈ ఫోటోలో జీన్ ఫ్యాంట్ డార్క్ బ్లూకలర్ షర్ట్ ధరించిన జగన్... స్టైలిష్ షూస్ తో పాటు మెడలో ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్ తో స్మైలిస్తూ కనిపించారు!

దీంతో "లండన్ లో ఫుల్ హ్యాపీగా జగన్" అంటు సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఈ ఫోటో ఇప్పటిదా, పాతదా అనేదానిపై స్పష్టత లేదు కానీ... ఫోటో మాత్రం లండన్ లో తీసినట్లుగానే కనిపిసుండటం గమనార్హం!

కాగా... సెప్టెంబర్ 2 న లండన్ వెళ్లిన జగన్... ఈ రాత్రికి తిరిగి ఏపీకి వస్తున్నారనేది తెలిసిన విషయమే!