అసెంబ్లీలోనే జగన్ సంచలనం
గత నాలుగున్నరేళ్ళుగా ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ని జగన్ ఇస్తారని అంటున్నారు
By: Tupaki Desk | 14 Sep 2023 3:39 AM GMTఈ నెల 21 వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాదాపుగా వారం రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈసారి సమావేశాలలో చంద్రబాబు అరెస్ట్ గురించి ప్రస్తావన రావడం దాని మీద విపక్షం అయిన టీడీపీ హోరెత్తించడం వంటివి ఉంటాయనుకుంటే అవేమీ సాగనీయకుండానే ఈ సమావేశాలలో వైసీపీ ప్రభుత్వం సరికొత్త అజెండాను ముందుకు తెస్తోంది అంటున్నారు.
గత నాలుగున్నరేళ్ళుగా ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ని జగన్ ఇస్తారని అంటున్నారు. ప్రతీ రోజూ ఒక్కో అంశం మీద ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుంది అని అంటున్నారు. దీంతోనే అసెంబ్లీ వేదికగానే తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రభుత్వం ఎన్నికలకు రెడీ అవుతోంది అని అంటున్నారు.
ఇక ముందస్తు ఎన్నికలకు కూడా వైసీపీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇపుడు ఏపీలో రాజకీయం కాస్తా వైసీపీకే అనుకూలంగా ఉంది. చంద్రబాబు మీద అవినీతి కేసులు నమోదు చేసి రిమాండ్ ఖైదీగా ఉంచారు. రేపటి రోజున ఆయన బయటకు వచ్చినా కూడా అవినీతి మరకలతో టీడీపీ మీద బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుపెట్టాలని వైసీపీ డిసైడ్ అయింది.
మరో వైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు అంటే వైసీపీ సిద్ధంగా ఉందని అంటున్నారు. కేంద్రం మదిలో ఏముందో తెలుసుకోవడానికి తొందరలో జగన్ ఢిల్లీకి వెళ్తారని అంటున్నారు. కేంద్రం కనుక జమిలి ప్రస్తావన తెస్తే మాత్రం ముందస్తు ఆలోచనలను వైసీపీ వాయిదా వేసుకోవచ్చు. అలా కాకుండా కేంద్రం తన మానాన తాను షెడ్యూల్ ప్రకారమే లోక్ సభ ఎన్నికలకు ప్రిపేర్ అయితే మాత్రం ఏపీలో ముందస్తునకు తెర లేపడానికి జగన్ అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారు అని అంటున్నారు.
ఇక చూస్తే ఎలా మొదలైందో కానీ ఈ అక్టోబర్ నాటికి ఏపీ అసెంబ్లీ రద్దు చేస్తారు అని సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీని జగన్ రద్దు చేసి తెలంగాణాతో పాటే వెళ్తారని అంటున్నారు. కానీ ఏది జరగాలన్నా కేంద్రం అనుమతి ఉంటేనే సాధ్యపడుతుంది అని అంటున్నారు.
ఇక ముందస్తు ఎన్నికలు జగన్ వెళ్లడానికి కారణం నానాటికి ఆర్ధిక రంగంలో ఇబ్బందులు దిగజారుతున్న పరిస్థితులే కారణం అంటున్నారు. అలాగే విపక్షాల మధ్య ఇంకా కుదరని పొత్తులు టీడీపీ కూడా ఇబ్బందులలో ఉండడం వంటివి కూడా ఉనాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీ వేదికగా పలు సంచలనాలకు జగన్ తెర తీస్తారని అంటున్నారు.