Begin typing your search above and press return to search.

నాలుగు సున్నాలు కలసినా ....జగన్ సంచలన కామెంట్స్ ?

ఏపీలో విపక్షాలు పొత్తుల కోసం అరాటపడుతున్నాయని జగన్ విమర్శించారు. పొత్తులు పెట్టుకుని అంతా కలసి రావాలని చూస్తున్నారని అన్నారు

By:  Tupaki Desk   |   9 Oct 2023 9:31 AM GMT
నాలుగు సున్నాలు కలసినా ....జగన్ సంచలన కామెంట్స్ ?
X

ఏపీలో విపక్షాలు పొత్తుల కోసం అరాటపడుతున్నాయని జగన్ విమర్శించారు. పొత్తులు పెట్టుకుని అంతా కలసి రావాలని చూస్తున్నారని అన్నారు. అయితే తాను మాత్రం ప్రజలనే నమ్ముకున్నాను అని చెప్పారు. ఇక ప్రతిపక్షాలు పొత్తులు చూస్తే ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు.

రెండు సున్నాలు కలసినా నాలుగు సున్నాలు కలసినా ఏమి లాభం అని ఆయన ప్రశ్నించారు. చివరికి అతి పెద్ద బండి సున్నా రవడం తప్ప అని ఆయన పొత్తులు పెట్టుకునే పార్టీల రిజల్ట్ ని క్లారిటీగా చెప్పేసారు. ఏపీని గతంలో పాలించిన పార్టీలు ఏమీ చేయలేదని వారు సున్నాలే ఇచ్చారు కాబట్టి జనాల నుంచి సున్నా రిజల్టే వస్తుందని జగన్ అన్నారు.

నాయకుడు అన్న వారు ప్రజలతో ఉండాలని ఆయన అన్నారు. తాను ప్రజలకు మంచి చేశాను కాబట్టే దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనని మాటలను అనగలుగుతున్నానని జగన్ అన్నారు. తాను గత నాలుగున్నరేళ్లలో చేసిన మేలు ప్రతీ ఇంటిలో ఉంటే ఆ మంచినే కొలమానంగా తీసుకుని తనకు ఓటేయమని కోరుతున్నాను అని చెప్పారు.

తన రాజకీయం అలాగే ఉంటుందని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేయడం చనిపోయిన తరువాత కూడా ప్రతీ ఇంటిలో ఫోటో రూపంలో బతికి ఉండడమే తనకు కావాలని అన్నారు. పేదవాడి చిరు నవ్వులో తనను తాను చూసుకోవాలని ఆరాటపడుతున్నానని జగన్ చెప్పారు.

ప్రతిపక్షాలకు కుర్చీ ఎందుకు అంటే వారికి సంపాదన కావాలని అని ఆయన విమర్శించారు. దోచుకో దాచుకో తినుకో అన్న సిద్ధాంతమే ప్రతిపక్షలది అని ఆయన ఫైర్ అయ్యారు. ప్రతిపక్షాలు ఎన్ని కలసినా జీరోవే వస్తుందని జగన్ స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వచ్చాక చెప్పిన ప్రతీ మాటను తప్పనిసరిగా నెరవేర్చానని ఆయన అన్నారు.

అందుకే తాను వై నాట్ 175 అని కూడా డేరింగ్ గా అనగలుగుతున్నానని జగన్ చెప్పారు. తాను ప్రజలకు చేసిన మేలు కళ్ల ముందే కనిపిస్తోందని అన్నారు. నా ఎస్టీలు, నా బీసీ, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని తాను ప్రజలను పేదలను కలుపుకుని ముందుకు పోతున్నాను అని అన్నారు. సామాజిక న్యాయం అన్నది వైసీపీ అధికారంలోకి వచ్చాకనే అందరికీ తెలిసింది అని ఆయన అన్నారు.

గ్రామ స్థాయి నుంచి మంత్రి మండలిలో మంత్రుల దాకా అన్ని చోట్లా బడుగు బలహీన వర్గాలకు సమాన న్యాయం చేసిన పార్టీ వైసీపీ అని ఆయన చెప్పారు. పేదల కోసం పనిచేసే వైసీపీ కావాలా లేక పెత్తందారీ పోకడలు కలిగిన టీడీపీ కావాలా అన్నదే ప్రజలలో చర్చకు పెట్టి గ్రామాల్లో ప్రచారం చేయాలని జగన్ సూచించారు. ప్రతీ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్ళి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని ఆయన కోరారు.