Begin typing your search above and press return to search.

175 / 175 లక్ష్యంగా కేడర్ తో జగన్ ప్లాన్ ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ మలి అడుగు కార్యాచరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది

By:  Tupaki Desk   |   12 Jan 2024 1:55 PM GMT
175 / 175 లక్ష్యంగా కేడర్ తో జగన్ ప్లాన్ ఇదే!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ మలి అడుగు కార్యాచరణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఇప్పటికే మూడు జాబితాల్లో ఇన్ ఛార్జ్ ల నియామక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో... ప్రస్తుతం నాలుగో జాబితా పనుల్లో వైసీపీ అధిష్టాణం బిజీ అయిపోయింది. వీలైనంత తొందర్లో ఆ కార్యక్రమాలు పూర్తి చేసి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసి నెక్స్ట్ స్టేప్ కి జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కేడర్ తో ఓకీలక సమావేశాల నిర్వహణకు వైసీపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా కేడర్‌ ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా భేటీలు నిర్వహించనుంది. ఈ క్రమంలో జనవరి 25 నుంచి రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానున్నాయి. ఇవి పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తున్నారు.

చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సర్వే ఫలితాలు, నేతల పనితీరుతో పాటు కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణలను మొదలైన విషయాలను ప్రాతిపదికగా తీసుకుని ఇన్ ఛార్జ్ లను ఎంపిక చేస్తున్న వైఎస్ జగన్... సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా... రాష్ట్రవ్యాప్తంగా జగన్‌ అధ్యక్షతన రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో కేడర్‌ సమావేశాలు జరగనున్నాయి.

వీటిలో ప్రధానంగా నాలుగు నుంచి ఆరు జిల్లాలకు కలిపి ఒకే కేడర్‌ సమావేశంగా నిర్వహించనున్నారు. ఈ భేటీల్లో ఎన్నికల కోసం వ్యవహరించాల్సిన వ్యూహంపై పార్టీ కేడర్‌ కు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సభ్యులందరినీ ఏకంచేసి, వారిలో చైతన్యం నింపుతూ రాబోయే ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లోనూ గెలిచేలా వారిని సంసిద్ధం చేయడమే ఈ సమావేశాల ముఖ్యమైన లక్ష్యంగా చెబుతున్నారు.

ఇందులో భాగంగా తొలి సమావేశం జనవరి 25న విశాఖపట్నం, భీమిలిలో జరగనుంది. ఇక మిగిలిన 4 ప్రాంతాల తేదీలను త్వరలో తెలియజేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ కు కనీసం 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున ఈ సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో... ఈ సమావేశాలు కేడర్ లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.