Begin typing your search above and press return to search.

జగన్ బిగ్ డెసిషన్ : వైసీపీ అభ్యర్ధులలో భారీ మార్పులు ?

వైసీపీ చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న అభ్యర్ధులను మార్చి భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంచి అని ప్రచారం అయితే సాగుతోంది

By:  Tupaki Desk   |   11 April 2024 8:44 AM GMT
జగన్ బిగ్ డెసిషన్ : వైసీపీ అభ్యర్ధులలో భారీ మార్పులు ?
X

వైసీపీ చాలా చోట్ల ప్రస్తుతం ఉన్న అభ్యర్ధులను మార్చి భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంచి అని ప్రచారం అయితే సాగుతోంది. అదెలా అంటే ఇపుడు బరిలో ఉన్న వారికి మరింత ధీటైన నేతలను అభ్యర్ధులుగా దించడం అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే కనుక ఇప్పటిదాకా గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా ఉన్న మంత్రి విడదల రజనిని గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించనున్నారు అని అంటున్నారు.

ఇక గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా ఉన్న కిలారి రోశయ్యను గుంటూరు టూ నుంచి ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అలాగే చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉన్న మనోహర్ నాయుడు ప్లేస్ లో ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కి చాన్స్ ఇస్తారు అని అంటున్నారు. ఇక్కడ బీసీ ప్రయోగం అంటూ చేశారు కానీ ఇపుడు పార్టీలో బలమైన నేతగా ఉన్న మర్రి రాజశేఖర్ ని ముందుకు తెస్తారు అని అంటున్నరు.

అలాగే కర్నూల్ లో చూస్తే కేఈ కుటుంబం వైసీపీలో చేరుతోంది. దాంతో కేఈ ప్రభాకర్ ని కర్నూల్ ఎంపీగా పోటీ చేయిస్తారు అని అంటున్నారు. అలాగే పెనమలూరికి పంపించిన మంత్రి జోగి రమేష్ ని మైలవరం తీసుకుని వస్తున్నారు ని అంటున్నారు. జోగి రమేష్ ది మైలవరం. ఆయన అక్కడ సీటు కోసం పట్టుబడుతూ వచ్చారు. కానీ ఆయన్ని పెనమలూరు పంపించారు.

అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్న వసంత క్రిష్ణ ప్రసాద్ టీడీపీలో చేరి సీటు పొందారు. ఆయన్ని ఓడించడం కోసం వైసీపీ చేస్తున్న మార్పులలో భాగంగా జోగి రమేష్ ని వెనక్కి తెస్తున్నారు అని అంటున్నారు. అలాగే జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్ ని విజయవాడ వెస్ట్ నుంచి అభ్యర్ధిగా నిలబెడతారు అని అంటున్నారు. ఇక్కడ మైనారిటీ అభ్యర్ధికి పార్టీ టికెట్ ఇచ్చింది. ఇపుడు మారుస్తోంది అని అంటున్నారు.

ఎందుకంటే ఇక్కడ నుంచి సుజనా చౌదరి పోటీలో ఉన్నారు. అలాగే పి గన్నవరం నుంచి పాముల రాజేశ్వరిని పోటీ చేయిస్తారు అని అంటున్నారు. ఆమె జనసేన నుంచి వైసీపీలో చేరారు. అలాగే మచిలీపట్నం ఎంపీ అభ్యర్ధిగా ఉన్న సిం హాద్రి చంద్రశేఖర్ ని అవనిగడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారు అని అంటున్నారు.

అలాగే రాయచోటి సీటుని రెడ్డప్పగారి రమేష్ రెడ్డికి ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద భారీ మార్పులే వైసీపీలో ఉంటాయని అంటున్నారు. అయితే దీని మీద వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్పు చేర్పులు ఏవీ వైసీపీలో ఉండవని అంటున్నారు. తాము గత నాలుగు నెలలుగా ఎంతో కసరత్తు చేసి అభ్యర్ధులను ఎంపిక చేశామని మంచి టీం తమకు ఉందని అన్నారు.

టీడీపీ కూటమిలోనే గందరగోళం ఉందని అక్కడ గందరగోళం నుంచి సైడ్ చేసేందుకే వైసీపీలో అభ్యర్ధుల మార్పులు అని అంటున్నారు అని విమర్శించారు. తమ పార్టీకి ఒకే నాయకుడు అని టీడీపీ కూటమికి ఎందరో నాయకులు ఉన్నారని అయోమయం అంతా ఆ వైపే ఉందని ఆయన విమర్శించారు. మరి సజ్జల మాటలు నిజమా మార్పులు ఉంటాయా లేవా అన్నది చూడాల్సి ఉంది.